ETV Bharat / state

ఇసుక లభ్యత పై విశాఖ జాయింట్ కలెక్టర్ సమీక్ష - joint collector conduct review on sand at vishakapatnam

విశాఖజిల్లాలో ఇసుక సరఫరా వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాలరెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లాలోని వివిధ ఇసుక డిపోలలో ప్రస్తుత పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

joint collector conduct review on sand at vishakapatnam
ఇసుక లభ్యత పై జాయింట్ కలెక్టర్ సమీక్ష
author img

By

Published : Jul 7, 2020, 7:21 PM IST

ఇసుక లభ్యత, వాహనాల లోడింగ్, అన్​లోడింగ్ పై విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాలరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇసుక సరఫరా వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇసుక వినియోగదారులకు వీలైనంత వేగంగా సరఫరా చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం గోదావరి వరదపోటు ఉన్నందున తూర్పుగోదావరి జిల్లా నుంచి ఇసుక మందగించిందని... శ్రీకాకుళం నుంచి ఇసుకను సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఇసుక తరలింపునకు వచ్చే వాహనాల వివరాలను సాండ్ ఎన్​ఫోర్స్​మెంట్ వారికి తెలియజేయాలని ఆదేశించారు. ఇసుక సరఫరాలో జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో ఎస్ఈబీ అడిషనల్ ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్, ఉప రవాణా కమిషనర్ రాజరత్నం, భూగర్భ గనులశాఖ సహాయ సంచాలకులు బైరాగినాయుడు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: 'ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలి'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.