చింతకాయల విజయ్ ఆధ్వర్యంలో తెదేపాలోకి చేరిన వైకాపా కార్యకర్తలు విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో రాజకీయ వలసలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నర్సీపట్నం మండలం పెద్ద బొడ్డేపల్లి గ్రామానికి చెందిన సుమారు 300 మంది వైకాపా కార్యకర్తలు తెదేపాలో చేరారు. మంత్రి అయ్యన్న తనయుడు చింతకాయల విజయ్ బాబు వీరందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఇవీ చూడండి
'ప్రత్యేక హోదా ఇచ్చే సత్తా కాంగ్రెస్‌కే ఉంది'