DATAPRO COMPANY: విశాఖపట్టణానికి చెందిన డేటా ప్రో కంప్యూటర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను.. జమ్ముకశ్మీర్ పరిపాలనా విభాగం బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. అభ్యర్థుల డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసినందుకు.. ఆ కంపెనీకి చెందిన బ్యాంక్ ఖాతాలపై నిషేధం విధించింది. అలాగే డేటా ప్రో కార్యకలాపాలను దేశవ్యాప్తంగా నిషేధించాలని కేంద్రాన్ని కోరింది.
గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం.. డేటాప్రో కంప్యూటర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను రద్దు చేశామని.. మూడు సంవత్సరాల పాటు జమ్ముకశ్మీర్ ప్రభుత్వం దీనిని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టినట్లు ఆర్డర్లో పేర్కొంది. ప్రాజెక్ట్ వ్యయంలో 10శాతం అంటే.. 3కోట్ల 9లక్షల 36వేల 241రూపాయలు జరిమానా విధించినట్లు తెలిపింది.
అసలేం జరిగిందంటే.. ప్రైవేట్ రంగంలో యువతకు ఉపాధి కల్పించడం, జమ్ముకశ్మీర్ స్టేట్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ (JKSRLM) హిమాయత్ ప్రోగ్రామ్‌ను అమలు చేయడంలో భాగంగా యువతకు శిక్షణ ఇచ్చేందుకు 2018లో డేటాప్రోను జమ్ము ప్రభుత్వం నియమించింది. ఈ ప్రాజెక్ట్ వ్యయం రూ.30కోట్లు కాగా.. మొదటి విడతగా రూ.7కోట్లకు పైగా చెల్లించారు. రెండవ విడత నిధులు పొందేందుకు కంపెనీ.. 89 మంది నకిలీ అభ్యర్థుల జాబితా, వారి బ్యాంకు వివరాలను సమర్పించారు.
ఈ అంశంపై అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసి విచారణ జరిపింది. ప్లేస్మెంట్ డాక్యుమెంట్లను ఫోర్జరీ చేశారనే ఆరోపణలపై ప్రాజెక్ట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీపై కేసు నమోదు చేసింది. మొత్తం 136 మంది అభ్యర్థుల్లో 89 మందివి నకిలీవని రుజువైనట్లు ఏసీబీ తెలిపింది. ఈ ఏడాది మేలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ హిమాయత్ జారీ చేసిన 'ఈటీవీ భారత్' వద్ద ఉన్న ప్రభుత్వ ఉత్తర్వు, ఏసీబీ నివేదిక ఆధారంగా.. అభ్యర్థుల ప్లేస్మెంట్ డాక్యుమెంట్లు ఫోర్జరీ చేసినట్లు స్పష్టమైంది.
ఇవీ చదవండి: