జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై రాష్ట్ర మంత్రుల చేసిన అనుచిత వాఖ్యలను విశాఖ జిల్లా జనసేన నేతలు ఖండించారు. రాష్ట ప్రభుత్వం కాపు రిజర్వేషన్‌కు సంబంధించిన శ్వేత పత్రం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వెనుకబడిన బడుగు బలహీన వర్గాలతో పాటు కాపులకు న్యాయం చేయాలని కోరారు. ఏడాదికి 2 వేల కోట్లు నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలని, లేని పక్షంలో తగు పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు.
ఇవీ చూడండి..: 'సచివాలయ రంగుల ఖర్చును వైకాపా నేతలే భరించాలి'