Pawan Kalyan reached Delhi tour updates: జనసేన అధినేత పవన్ కల్యాణ్ దేశ రాజధాని దిల్లీ బాట పట్టారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ నుంచి గత రాత్రి హస్తినకు చేరుకున్న ఆయన.. నేడు భారతీయ జనతా పార్టీ ముఖ్య నేతలతో, కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ఈ క్రమంలో భేటీలో పవన్ కల్యాణ్ ఏయే అంశాలపైనా చర్చించనున్నారు..? ఎందుకోసం దిల్లీకి వెళ్లారు..? పవన్‌తో పాటు ఇంకెవరు ఆ భేటీలో పాల్గొనబోతున్నారు..? అనే తదితర అంశాలపై ఆసక్తి నెలకొంది.
పవన్ కల్యాణ్ దిల్లీ పర్యటన: వివరాల్లోకి వెళ్తే.. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నేడు దిల్లీలో పర్యటిస్తున్నారు. గతరాత్రి (ఆదివారం) రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్‌కు వెళ్లిన పవన్ కల్యాణ్.. అక్కడి నుంచి బయలుదేరి హస్తినకు చేరుకున్నారు. ఈ పర్యటనలో పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా వెంట ఉన్నారు. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి చెందిన పలువురు ముఖ్య నేతలతో, కేంద్ర మంత్రులతో పవన్ కల్యాణ్, పార్టీ వ్యవహారాల ఛైర్మన్ మనోహర్ కూడా భేటీ కానున్నారు.
పవన్ కల్యాణ్ భేటీపై ఏపీలో ఉత్కంఠ: భేటీ పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవలే జరిగిన పరిణామాలపై, తాజా రాజకీయ పరిస్థితులపై, రాబోయే రోజుల్లో పార్టీ భవిష్యత్తు కార్యాచరణతో పాటు పలు ఇతర అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతేకాదు, రాష్ట్రంలోని బీజేపీ నేతలకు, జనసేనకు మధ్య దూరం పెరిగిందనే ఊహాగానాల నేపథ్యంలో పవన్ కల్యాణ్.. దిల్లీలో పర్యటించటంపై రాష్ట్రంలో ఉత్కంఠ నెలకొంది.
వైసీపీ దాడులను కేంద్రం దృష్టికి తీసుకెళ్తా..!: మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ దిల్లీ బాట పట్టడం.. భారతీయ జనతా పార్టీలోని ముఖ్య నేతలను కలవబోతుండటం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో ప్రతిపక్షాలపై అధికార పార్టీ (వైఎస్సార్ కాంగ్రెస్) చేస్తున్న దాడుల గురించి త్వరలోనే.. కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని ఇటీవలే పవన్ కల్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పవన్ కల్యాణ్.. ప్రస్తుతం దిల్లీకి వెళ్లడంతో తీవ్ర చర్చ జరుగుతుంది.
అమిత్ షాతో, జేపీ నడ్డాతో పవన్ భేటీ: ఇక, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విషయానికొస్తే.. గత నెలలో ఆయన రెండుసార్లు హస్తినకు వెళ్లివచ్చారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమైన జగన్.. రాష్ట్రానికి విడుదల చేయాల్సిన నిధులపై చర్చించి.. రాష్ట్రానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ దిల్లీలో పర్యటిస్తుండడంతో ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే కేంద్ర మంత్రి అమిత్ షాతో, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పవన్ కల్యాణ్ అపాయింట్‌మెంట్స్ ఖరారు అయినట్టు సమాచారం.
ఇవీ చదవండి