ETV Bharat / state

Janasena : వైఎస్సార్సీపీ విముక్త ఏపీ మా లక్ష్యం.. చంద్రబాబుతో మరిన్ని సమావేశాలు.. : నాదెండ్ల - ఏపీ ముఖ్యవార్తలు

Janasena : రాష్ట్ర పరిస్థితులు, ప్రయోజనాల దృష్ట్యా చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ భేటీ అవసరమని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. భవిష్యత్తులో టీడీపీ అధినేత, జనసేనాని మధ్య మరిన్ని సమావేశాలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ ముక్త ఆంధ్రప్రదేశ్‌ కోసం జనసేన పని చేస్తోందన్న ఆయన... రాబోయే ఎన్నికలకు అన్నివిధాలుగా సన్నద్ధం అవుతున్నామని వెల్లడించారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Apr 30, 2023, 10:15 PM IST

Janasena : టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్ భేటీపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ స్పందించారు. భవిష్యత్తులో ఇరువురి మధ్య మరిన్ని సమావేశాలు ఉంటాయని చెప్పారు. ఆదివారం విశాఖపట్నంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ‘రాష్ట్రంలోని పరిస్థితుల దృష్ట్యా చంద్రబాబు, పవన్‌ భేటీ అవశ్యం అని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్‌ కోసం జనసేన పని చేస్తోందని.. ఈ మేరకు రాబోయే ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నామని తెలిపారు. విశాఖలో భూదందాలపై జనసేన పోరాటం చేస్తోందని ఈ సందర్భంగా మనోహన్ వెల్లడించారు. వైఎస్సార్సీపీ నేతలు.. ‘నువ్వే మా నమ్మకం జగనన్న’ అని స్టిక్కర్లు అంటిస్తున్నారు కానీ, క్షేత్రస్థాయిలో జగనన్నపై నమ్మకం లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన యువతను హింసిస్తున్నారని నాదెండ్ల మండిపడ్డారు.

పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం.. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమై పోయిందని మనోహర్ ఆరోపించారు. నిందితులపై కేసులు నమోదు చేయాల్సిన పోలీసులు బాధితులపైనే కేసులు పెట్టడం బాధాకరమని అన్నారు. లా అండ్ ఆర్డర్ పూర్తి స్థాయిలో క్షీణించింది... ఎక్కడ చూసినా లిక్కర్ దందా, ఇసుక మాఫియా, కొండలు కొల్లగొట్టడం వంటి దందాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, ఏ ఒక్కరు ప్రశ్నించినా సరే.. ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకుని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. ఒక రాజ్యసభ సభ్యుడు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఓటర్లను బెదిరిస్తుంటే.. మహిళలు అడ్డుకుని గొడవ చేయడంతో పోలీసులు ఇష్టారాజ్యంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ఈ సందర్భంగా ఉదహరించారు.

వైఎస్సార్సీపీ విముక్త ఏపీ లక్ష్యం.. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ వైఎస్సార్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం నిర్ణయం తీసుకోవాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీని ఓడించాలన్నదే జనసేన విధానం, నినాదమని నాదెండ్ల స్పష్టం చేశారు. అన్ని పార్టీల నాయకులు ఏకమై కలిసికట్టుగా ముందుకెళ్లాలని గతంలోనే పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారని గుర్తుచేస్తూ... రాబోయే ఎన్నికలకు సిద్ధమవుతున్నామని, అందులో భాగంగానే టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యారని తెలిపారు. జనసేన పార్టీ రాష్ట్రం, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ఆశించి పనిచేస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ తో పాటు, మంత్రులు, ఎమ్మెల్యేలందరినీ తిప్పికొట్టే విధంగా.. మంచి పరిపాలన అందించే విధంగా.. ప్రజలకు భరోసా ఇచ్చేవిధంగా.. ప్రణాళిక వ్యూహం దిశగా జనసేన పార్టీ అడుగులు వేస్తుందని వెల్లడించారు. అందులో అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసేందుకు కసరత్తు జరుగుతోందని నాదెండ్ల మనోహర్ చెప్పారు.

రాజకీయాల్లో ఊహాగానాలు సహజం.. పవణ్ కళ్యాణ్ గారు అడుగేసిందే ప్రజల కోసం. రాజకీయ వ్యూహాల్లో సమావేశాలు, చర్చలు సహజం.. వాటిపై ఊహాగానాలు అనవసరం. చంద్రబాబుతో మరిన్ని సమావేశాలు ఉంటాయి. - నాదెండ్ల మనోహర్, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌

జనసేన నేత నాదెండ్ల మనోహర్

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.