ETV Bharat / state

అధికారం కోసం కాదు - మార్పు కోసం ఓట్లు కావాలి: పవన్​ కల్యాణ్​ - JanaSena Chief Pawan Kalyan comments

JanaSena Chief Pawan Kalyan Comments: జీవితంలో ఎన్నో అపజయాలు ఎదుర్కొన్నానని, ఏం జరిగినా జనసేన పార్టీని మరో పార్టీలో విలీనం చేయబోనని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. విశాఖలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న పవన్ విశాఖ ఉక్కు పరిశ్రమ, ఉత్తరాంధ్ర వలసలు, ఆడ పిల్లల భద్రత వంటి అంశాలపై సుదీర్ఘంగా ప్రసంగించారు.

pawan_kalyan_comments
pawan_kalyan_comments
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 7, 2023, 8:05 PM IST

Updated : Dec 8, 2023, 6:18 AM IST

JanaSena Chief Pawan Kalyan Comments: 'విశాఖ ఉక్కు అంశం భావోద్వేగంతో కూడిన అంశం. ఇదే విషయాన్ని నేను కేంద్ర పెద్దలకు చెప్పాను. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తే ఎలాంటి భావోద్వేగాలకు దారి తీస్తుందో తెలియదు. విశాఖ ఉక్కు అనేది ఆంధ్రులను ఏకతాటిపై ఉంచిన నినాదం. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పోరాటం అన్ని జిల్లాలను ఏకం చేసిన నినాదం. విశాఖ ఉక్కుపై నేను చెప్పిన నా అభిప్రాయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా గారు గౌరవించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా ప్రయత్నం చేయగలిగాం' అని జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కల్యాణ్ అన్నారు.

Pawan Kalyan Visakha Tour Updates: విశాఖపట్నంలో జనసేనాని పవన్ కల్యాణ్ గురువారం పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన ఎస్.రాజా గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన జనసేన బహిరంగ సభలో పాల్గొన్నారు. పవన్‌ సమక్షంలో సుందరపు వెంకట సతీష్ కుమార్ జనసేనలో చేరారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ విశాఖ ఉక్కు పరిశ్రమ, ఉత్తరాంధ్ర వలసలు, ఆడపిల్లల భద్రత వంటి అంశాలపై సుదీర్ఘంగా ప్రసంగించారు.

Pawan Kalyan on Party Alliances: ఎన్డీఏతో పొత్తులోనే ఉన్నాం.. ఎన్నికలకు టీడీపీ-జనసేన-బీజేపీలు కలిసి వెళ్లాలని నా ఆకాంక్ష: పవన్‌

Pawan Kalyan on Votes: ఎప్పుడూ ఎన్నికల కోసం తాను ఆలోచించలేదని, ఒక తరం భవిష్యత్తు కోసమే తాను ఆలోచించానని పవన్ కల్యాణ్ అన్నారు. ఈ తరాన్ని కాపాడుకుంటూ రాబోయే తరం కోసం పని చేస్తానని హామీ ఇచ్చారు. తాను ఓట్ల కోసం రాలేదు, మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చానన్నారు. అధికారం కోసం ఓట్లు అడగను గాని మార్పు కోసం ఓట్లు అడుగుతానని ఆయన అన్నారు. ఉత్తరాంధ్ర చైతన్యం ఉన్న నేల, అందరినీ ఆహ్వానించే నేల, ఉత్తరాంధ్ర ప్రజలు ఉపాధి కోసం వలసలు వెళ్తున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారం కోసం కాదు - మార్పు కోసం ఓట్లు కావాలి: పవన్​ కల్యాణ్​

Pawan Kalyan Comments: ''ఉత్తరాంధ్ర వలసలు ఆగాలి. ఇక్కడే ఉపాధి అవకాశాలుండాలి. కష్టం వస్తే ఆదుకుంటామని చెప్పేందుకే జాలర్లను ఆదుకున్నా. పదవుల కోసం నేనెప్పుడూ ఆలోచించలేదు. మీ ప్రేమాభిమానాలతోనే పార్టీని నడపగలుగుతున్నా. రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఆగాలి. ఉత్తరాంధ్రలో కాలుష్యం బాగా తగ్గాలి. ఉత్తరాంధ్ర ప్రజలకు వైసీపీ నేతలు నష్టం చేస్తున్నారు'' అని పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు.

Pawan Kalyan on Visakha Steel Industry: విశాఖ ఉక్కు పరిశ్రమ గురించి తాను దిల్లీ వెళ్లి అమిత్‌ షాతో మాట్లాడానని పవన్ కల్యాణ్ వెల్లడించారు. డీసీఐ లాభాల బాటలో ఉందంటే తాను చేసిన కృషే కారణమని ఆయన గుర్తు చేశారు. స్టీల్‌ ప్లాంట్‌ తెలుగు ప్రజల భావోద్వేగాలకు సంబంధించిన విషయమని, ఏ అధికారం లేని తానే ఇంత చేస్తుంటే వైసీపీ నేతలు ఎంత చేయాలి? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. స్టీల్‌ ప్లాంట్ గురించి ఇవాళ్టికి కూడా ఏ ఒక్క వైసీపీ నాయకుడు మాట్లాడటం లేదని ఆయన మండిపడ్డారు. జనసేనకు అండగా నిలబడితే స్టీల్‌ ప్లాంట్ కోసం తాను పోరాటం చేస్తానని విశాఖపట్నం ప్రజలకు పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.

Pawan meeting With Janasena Representatives: ప్రభుత్వ విధానాల్లోని లోపాలు, వైఫల్యాలపై సమర్థంగా మాట్లాడాలి: పవన్

Pawan Kalyan on Girls Safety: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆడపిల్లలకు భద్రత కావాలని పవన్ కల్యాణ్ ఉద్ఘాంటించారు. ఆడ పిల్లల అదృశ్యంపై మాట్లాడితే తనను ఎగతాళి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్‌ షా లాంటి వ్యక్తులు చెబితేనే తాను ఆడ పిల్లల అదృశ్యాలపై మాట్లాడానని పవన్ కల్యాణ్ వివరించారు. ఆడ పిల్లల అదృశ్యం ఘటనల్లో అనేకసార్లు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేయలేదని ధ్వజమెత్తారు. బాధ్యతగా మాట్లాడేవారు ఉంటేనే వ్యవస్థలు సరిగా పనిచేస్తాయన్న పవన్ కల్యాణ్ టీడీపీ-జనసేన ప్రభుత్వం వస్తే పోలీసు శాఖకు పునర్వైభవం కల్పిస్తామన్నారు. ఈ ప్రభుత్వం పోలీసులను సమర్థంగా వినియోగించడం లేదని, తమ ప్రభుత్వం ఏర్పడితే సమర్థులైన పోలీసు అధికారులను నియమించి శాంతి భద్రతలు కాపాడతామని పవన్ వెల్లడించారు.

Pawan Kalyan on YCP Leaders Movie Tickets: సినిమా టికెట్లు లాంటి చిల్లర విషయాలే వైసీపీ నేతలకు కావాలని పవన్ ఆగ్రహించారు. సినిమా టికెట్ల గురించి సీఎస్‌కు, ఎమ్మార్వోలకు ఎందుకు? అని ప్రశ్నించారు. మీరు (ప్రజలు) ఇచ్చిన ధైర్యంతోనే వైసీపీ కిరాయి గూండాలను ఎదుర్కొంటున్నానని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. తాము అధికారంలోకి వస్తే చిల్లర విషయాలకు రాజకీయాలు చేయమని, మరోసారి వైసీపీ వైపు చూస్తే రాష్ట్ర-యువత భవిష్యత్తు నాశనమేనని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

''నా జీవితంలో ఎన్నో అపజయాలు ఎదుర్కొన్నా. నా ఓటమి తర్వాత కూడా విశాఖ ప్రజలు నాతోనే ఉన్నారు. విశాఖ ప్రజలు నాపై ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. నమ్ముకున్న సిద్ధాంతం కోసం గట్టిగా నిలబడాలి. ఏం జరిగినా జనసేనను మరో పార్టీలో విలీనం చేయను. రాష్ట్రంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు రావాలి. విడిపోయిన రాష్ట్రానికి మేలు జరుగుతుందనే 2014లో బీజేపీకి మద్దతిచ్చాను. వచ్చే ఎన్నికల తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించాల్సి ఉంది. అభిమానం ఓటుగా మారకపోతే అవన్నీ నినాదాలకే పరిమితం అవుతాయి. పోటీ చేసిన అన్ని చోట్లా విజయం సాధిస్తే మనం బాగా సేవ చేయగలం. జనసేనకు ఒక్క ఎంపీ సీటు ఉన్నా స్టీల్‌ప్లాంట్‌కు గనులు తెచ్చేవాడిని. సీఎం ఎవరనేది నేను, చంద్రబాబు కలిసి నిర్ణయించుకుంటాం.''-పవన్ కల్యాణ్, జనసేన అధినేత

Janasena Pawan Kalyan on TOEFL Contract: జగన్, బొత్సకు అమెరికన్ ఇంగ్లిష్ వచ్చా..? 'టోఫెల్' ఒప్పందం పెద్ద స్కామ్ : పవన్

Last Updated : Dec 8, 2023, 6:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.