నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో సమస్యలను తక్షణమే పరిష్కరించాలని నియోజకవర్గ జనసేన నేతలు డిమాండ్ చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మాట్లాడిన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సూర్య చంద్ర.. రోగులకు నాణ్యమైన ఆహారాన్ని అందించడంలోనూ అధికారులు విఫలమవుతున్నారని ఆరోపించారు.
150 పడకల ఆసుపత్రిలో ప్రసూతి విభాగాలకు సరైన స్త్రీ వైద్యులు లేకపోవడం విడ్డూరమన్నారు. ఇవే అంశాలపై త్వరలోనే జిల్లా కలెక్టర్‌కు వితని పత్రం అందజేయనున్నట్లు తెలిపారు. విశాఖలో అరెస్ట్ చేసిన వైద్యుడు సుధాకర్‌ను మానవతా దృక్పథంతో విధుల్లోకి తీసుకునేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.
ఇవీ చూడండి: