ETV Bharat / state

మహిళాభివృద్ధికి జనమిత్ర సంస్థ బాటలు.. బ్యాంకింగ్ వ్యవస్థపై అవగాహన - విశాఖ జిల్లా ప్రధాన వార్తలు

విశాఖ జిల్లాలోని జనమిత్ర సంస్థ మహిళల అభివృద్ధికి బాటలు వేస్తోంది. స్వచ్ఛంద సంస్థగా కార్యకలాపాలు ప్రారంభించి మహిళలే సభ్యులుగా, వారిలో పొదుపు, అక్షర జ్ఞానం, బ్యాంకింగ్ కార్యక్రమాల పట్ల చైతన్యం కలిగించిందీ ఈ సంస్థ. పది రూపాయల సభ్యత్వం నుంచి మొదలై 13 వేల మంది సభ్యులతో 15 కోట్ల రూపాయల టర్నోవర్ తో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచి మహిళా ఐక్యతను చాటి చెబుతోంది.

మహిళాభివృద్ధికి జనమిత్ర సంస్థ బాటలు.
మహిళాభివృద్ధికి జనమిత్ర సంస్థ బాటలు.
author img

By

Published : Aug 28, 2021, 8:52 PM IST

మహిళాభివృద్ధికి జనమిత్ర సంస్థ బాటలు

విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం తిమ్మరాజుపేట ఒక కుగ్రామం. 1992లో కర్రి సీతారాం అనే వ్యక్తి చేసిన ప్రయత్నాలు అక్కడి మహిళల అభివృద్ధికి రాచబాటగా మారాయి. రాత్రి బడులను నిర్వహించి వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దారు. ప్రధానంగా కుటుంబ అవసరాలకు పనికొచ్చే విధంగా పొదుపు రుణ వితరణ వంటి ఆశయాలతో ఆరంభించి, తర్వాత జనమిత్ర పరస్పర పొదుపు సహకార సంఘంగా మార్పు చేశారు. డ్వాక్రా మహిళా ఉద్యమం ఆరంభానికి ముందుగానే ఈ రకమైన పొదుపు మంత్రాన్ని ఇక్కడి మహిళలు పాటించేలా చేయగలిగారు.

అచ్యుతాపురం పరిసరాల్లోని 6 మండలాల్లో 150కి పైగా గ్రామాల్లో సుమారు 13 వేల మంది మహిళలు జనమిత్రలో సభ్యులుగా ఉన్నారు. వీరికి వివిధ ఆర్థిక కార్యకలాపాలకు, వ్యక్తిగత అవసరాల కోసం రుణాలు ఇవ్వడం తిరిగి చెల్లించడం ఉంటుంది. మరోవైపు మహిళలకు వివిధ అంశాల్లో శిక్షణ కూడా ఇస్తున్నారు. వీరు చేస్తున్న ఆర్థిక కార్యకలాపాలు జాతీయ స్థాయిలో నాబార్డు, సిడ్బీ వంటి వాటి దృష్టిని కూడా ఆకర్షిస్తున్నాయి. ఆర్గానిక్ రైతులను ప్రత్యేకంగా ప్రోత్సహించే దిశగా ఈ సంస్థ ప్రస్తుతం అడుగులు వేస్తోంది.

బ్యాంకింగ్ సొసైటీ కార్యకలాపాలను నిర్వర్తించే వారిలోనూ ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. 60ఏళ్లు దాటిన మహిళలకు పింఛన్ కూడా ఇక్కడ ఇస్తున్నారు. తమ కష్ట సుఖాల్లో ఈ జనమిత్ర అండగా ఉందని వారు చెబుతున్నారు. మహిళాభివృద్ధిలో గుణాత్మక మార్పును తీసుకు వచ్చిన ఈ సంస్థ రానున్న కాలంలో తన కార్యకలాపాలను మరింతగా విస్తరించే దిశగా ప్రణాళికలు రచిస్తోంది.

ఇదీ చదవండి:

ఆంగ్లం మోజులో తెలుగును నిర్లక్ష్యం చేయడం తగదు: సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.