ETV Bharat / state

'విశాఖలో ప్రభుత్వ భూములను వైసీపీ నేతలు మాయం చేస్తున్నారు' - కార్పోరేటర్ పీతల మూర్తి యాదవ్

Janasena leader Murthy Yadav: విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ క్రైస్తవ మైనార్టీ సంస్ధల ఆస్తులను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. వివాదాలున్నా టీడీఆర్​లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. భూముల కబ్జాపై ప్రత్యక్ష పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

జనసేన కార్పోరేటర్ పీతల మూర్తి యాదవ్
జనసేన కార్పోరేటర్ పీతల మూర్తి యాదవ్
author img

By

Published : Nov 22, 2022, 5:32 PM IST

Janasena leader Murthy Yadav: విశాఖలో సీబీసీఎన్​సీకి చెందిన క్రైస్తవ మైనార్టీ సంస్ధల ఆస్తులను కబ్జా చేసేందుకు విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ప్రయత్నిస్తున్నారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. ఇందుకోసం రూ.63 కోట్ల విలువైన టీడీఆర్​లను ఎలా జారీ చేస్తారని ఆయన ప్రశ్నించారు. విశాఖ నగరం నడిబొడ్డున సిరిపురం జంక్షన్​లో ఉన్న 75 సర్వే నెంబర్​లో 3600 గజాల ప్రభుత్వ భూమి ఎలా మాయమైందని మండిపడ్డారు. ఇప్పటికే నగరంలో రుషికొండ సహా పలు ప్రభుత్వ భూములను వైసీపీ నేతలు వివిధ రూపాలలో కొట్టేస్తున్నారని.. ఇప్పుడు మైనార్టీ అస్తులను కాజేస్తున్నారని మూర్తి యాదవ్​ ఆరోపించారు.

ఎంవీవీ ఎక్కడ నిర్మాణాలు చేసినా.. ప్రభుత్వ పోరంబోకు, కాలువలను కబ్జా చేయడం అలవాటుగా మారిందని విమర్శించారు. ఈ విషయాలన్నీ ముఖ్యమంత్రికి తెలియకుండా జరుగుతున్నాయా అని నిలదీశారు. న్యాయ వివాదాలున్నా.. ఏమీ లేవని విశాఖ మహా నగర పాలక సంస్ధ కమిషనర్​కు వివరణ ఇచ్చేసి.. టీడీఆర్​లు తీసుకున్నారన్నారు. ఈ పనులు చేయనందుకే.. గత కమిషనర్​ను బదిలీ చేశారా అని ప్రశ్నించారు. దీనిపై తాము ప్రత్యక్ష పోరాటానికి సిద్దమవుతామని పీతల మూర్తి యాదవ్​ స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.