విశాఖ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయంలో జమ్మి వేట ఉత్సవం కరోనా నిబంధనలకు అనుగుణంగా నిర్వహించారు. ఈసందర్భంగా స్వామివారు రామావతారంలో భక్తులకు దర్శనమించారు. చెడుపై మంచి విజయం కోసం జమ్మి చెట్టును పూజిస్తారని అర్చకులు తెలిపారు. అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాలను తిరువీధుల్లో ఊరేగించారు. శమీ వృక్షానికి, స్వామివారి ఆయుధాలకు పూజలు జరిపిన అర్చకులు, కొవిడ్ నేపథ్యంలో సింహగిరి పైనే ఉత్సవం నిర్వహించినట్లు తెలిపారు. అయితే ప్రతి సంవత్సరం విజయదశమి రోజున సింహగిరి కింద స్వామివారి ఉద్యాన వనంలో శమిపూజ ఉత్సవం దేవస్థానం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించేవారు.
ఇవీ చూడండి...