విశాఖ జిల్లా పాడేరు జి.మాడుగులలో ఉపాధి హామీ కార్యాలయాన్ని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏపీఓ ఈసీ కంప్యూటర్ సిబ్బంది ఎవరు అందుబాటులో లేరు. ఫలితంగా వారి వేతనాలు వెంటనే నిలిపివేయాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అధికారులను ఆదేశించారు. మండలంలో 12 వేల మంది కూలీలకు పని దినాలు కల్పించాల్సి ఉండగా.. రెండు వేల మందికి పని కల్పించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ ఇటువంటి సంఘటనలు పునరావృతమైతే ఉద్యోగాలు ఉండవు అని హెచ్చరించారు. గతంలో చాలాసార్లు హెచ్చరించినప్పటికీ విధి నిర్వహణలో మార్పు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండీ.. కొవిడ్ రోగుల అవస్థలు.. వార్డుల్లోకి స్నానాల గదుల్లోని నీరు