మతాశిశు మరణాలు నివారించడానికి ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన అరకులోయలో ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి చేతుల మీదుగా గిరి శిఖర గర్భవతులకు వసతి గృహం ప్రారంభించారు. మారుమూల కొండ ప్రాంతాల్లో గిరి గర్భిణీలు పడుతున్న అవస్థలు దృష్టిలో ఉంచుకొని ఇక్కడ వసతి సౌకర్యం అందిస్తున్నారు. మంగళవారం వాటి పని తీరును పరిశీలించడానికి పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బాలాజీ సందర్శించారు. గర్భిణులకు అందుతున్న భోజనం, వసతి సౌకర్యంపై ఆరా తీశారు. వారితో కలిసి భోజనం చేశారు. సమస్యలు తలెత్తితే తమ దృష్టికి తీసుకురావాలని వైద్య సిబ్బందికి ఆదేశించారు.
ఇదీ చదవండి :