విశాఖ జిల్లా చోడవరంలో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పెద్దేరు నది నుంచి పట్టణ ప్రజలకు తాగు నీరు అందిస్తారు. నది నుంచి మంచి నీటి పథకానికి... నీరు సరఫరా చేసే ప్రధాన పైపు దెబ్బతింది. దీంతో కోనాం అతిథి గృహం వెనుక దుడ్డువీధి వద్ద ఉన్న రెండు తాగునీటి పథకాల నుంచి నీటి సరఫరా జరగలేదు. ఈ రెండు నీటి పథకాల ద్వారా.. రోజూ నాలుగు లీటర్ల నీరు ప్రజలకు అందుతుంది. తాగునీటి సరఫరా విషయంలో పంచాయతీ వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందుచూపు లేకపోవటం, పర్యవేక్షణ లోపం కారణంగానే సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. దెబ్బతిన్న పైపుకు మరమ్మతులు చేయిస్తున్నామని పంచాయతీ కార్యదర్శి లోవరాజు చెప్పారు.
ఇదీ చదవండి: నైరుతి రుతుపవనాల ఆగమనం : రాగల 3 రోజులూ మోస్తరు వర్షాలు