ఎన్నికలబందోబస్తుకు సంబంధించి విశ్రాంత ఆర్మీ, పోలీసు అధికారులు, సిబ్బంది స్వచ్ఛందంగా పాల్గొనాలని నగర పోలీస్ కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా కోరారు. విశాఖ నగరంలో ఎన్నికల విధులు నిర్వర్తించేందుకు 15 కంపెనీల కేంద్ర బలగాలు కావాలని అడగ్గా.. ఇప్పటికి 4 కంపెనీల సిబ్బందేచేరుకున్నారని తెలిపారు. మిగతా బలగాలు రెండు మూడు రోజుల్లోవస్తాయని ఆయన వివరించారు. లైసెన్స్ కలిగిన ఆయుధాలు వినియోగిస్తున్న ఇద్దరు మినహా మొత్తం 819 ఆయుధాలుస్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఆ ఇద్దరి చిరునామా సరిగా లేని కారణంగా వారిపై కేసు నమోదు చేశామన్నారు. వ్యాపారస్థులు 50వేలకు మించి నగదును తరలించేటప్పుడు అందుకు తగిన పత్రాలువెంట కచ్చితంగా తీసుకువెళ్లాలని... లేకుంటే ఆమొత్తాన్ని సీజ్ చేస్తామని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి కాటంనేని భాస్కర్ తెలిపారు.