విశాఖ విమానాశ్రయంలో రెండేళ్ల క్రితం జనవరి 25న అప్పటి ప్రతిపక్షనేత జగన్, వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిలను నిర్బంధించిన ఘటనపై నిన్న విచారణ జరిగింది. విశాఖ పోలీస్ కమిషనర్ మీనా, ఏఎస్పీ చిట్టిబాబు రాజ్యసభ సభా హక్కుల కమిటీ ముందు హాజరై వివరణ ఇచ్చారు. గురువారం సాయంత్రం రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నేతృత్వంలోని సభాహక్కుల కమిటీ ముందు సభ్యుల ప్రశ్నలకు వారు సమాధానమిచ్చారు. సుమారు గంటన్నరపాటు కమిటీ సభ్యులు ప్రశ్నించినట్లు తెలిసింది. ఏఎస్పీ చిట్టిబాబు నుంచి ఎక్కువ సమాచారం రాబట్టినట్లు తెలిసింది. ప్రత్యేక హోదా కోరుతూ విశాఖకు వచ్చిన తమను రన్వే నుంచి నిర్బంధంలోకి తీసుకోవటంపై ఎంపీ విజయసాయిరెడ్డి సభాహక్కుల కమిటీకి ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం మీనా మీడియా మాట్లాడారు. కమిటీ సభ్యులు తమ సమాధానాల పట్ల సంతృప్తి చెందారని భావిస్తున్నామని చెప్పారు.
జగన్, విజయసాయిరెడ్డిల నిర్బంధంపై విచారణ - vijaya sai reddy
2017లో ప్రత్యేక హోదా కోరుతూ విశాఖలో తలపెట్టిన కొవ్వొత్తుల ర్యాలీకి హాజరయ్యేందుకు విచ్చేసిన జగన్, విజయసాయిరెడ్డిలను పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. దీనిపై రాజ్యసభ సభా హక్కుల కమిటీ విశాఖ పోలీసులను ప్రశ్నించింది.