ETV Bharat / state

'కొవిడ్ సోకిందని... ఐసీయూ నుంచి డిశ్చార్జ్ చేసేస్తామంటున్నారు' - అమానవీయ ఘటన న్యూస్

"మాకు న్యాయం చేయండయ్యా... మా నాన్న గారు వెంటిలేటర్​పై ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో తలకి తీవ్ర గాయమైంది. ఆసుపత్రిలో చేర్చుకునే ముందు కొవిడ్ పరీక్షల్లో నెగిటివ్ రాగానే... ఐసీయూలో చికిత్స ప్రారంభించారు. తీరా ఇప్పుడు కరోనా సోకిందంటూ హఠాత్తుగా డిశ్చార్చ్ చేసేస్తామంటున్నారు. మీకు దణ్ణం పెడతాం.. మాకు న్యాయం చేయండి" అంటూ.. ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. తండ్రి ప్రాణాలను కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది.

inhuman incident
తండ్రి ప్రాణాలు కాపాడేందుకు... కుమార్తె ఆరాటం
author img

By

Published : May 1, 2021, 2:50 PM IST

తండ్రి ప్రాణాలు కాపాడేందుకు...

విశాఖ‌లో 5 రోజుల క్రితం ప్రమాద‌వ‌శాత్తు త‌ల‌కు గాయ‌మైన వ్యక్తిని రాంన‌గ‌ర్ లోని ఓ ప్రైవేట్ ఆసుప‌త్రిలో చికిత్స కోసం చేర్చారు. అప్పుడు కొవిడ్‌ పరీక్షలు చేయగా... నెగటివ్‌గా నిర్ధరణ అయింది.

ఆ తర్వాత.. కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిందని... హఠాత్తుగా డిశ్చార్జ్‌ చేసేస్తామని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రాణాపాయ స్థితిలో వెంటిలేటర్‌పై ఉన్న తన తండ్రిని ఎక్కడికి తీసుకువెళ్లాలంటూ కరోనా బాధితుడి కుమార్తె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:

విశాఖ ఎల్జీ పాలీమర్స్ కేసులో ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.