విశాఖలోని రామ్ కీ ఫార్మా సిటీ విస్తరణకు ప్రణాళికలు వేస్తున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఫార్మా సిటీకి సంబంధించి మంగళగిరి లోని ఏపీఐఐసీ కార్యాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేయాల్సిన వసతుల కల్పనపై చర్చించారు.ఈ ఫార్మా సిటీ ద్వారా మరిన్ని ఉపాధి అవకాశాలు, పెట్టుబడుల పెంపునకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. దీనికి సమీపంలో గతంలో కేటాయించిన కంపెనీల స్థాపనకు వేగంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు, రాంకీ ఫార్మా సిటీ నిర్వహణా సంస్థ రాంకీ చైర్మన్ అయోధ్యరామి రెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చదవండి: GVMC: యూజర్ చార్జీలు, చెత్తపై పన్ను వసూలుకు జీవీఎంసీ కౌన్సిల్ తీర్మానం