ETV Bharat / state

విశాఖలో ఇంద్ర నేవీ విన్యాసాలు - విశాఖ నావీ తాజా వార్తలు

విశాఖ సాగరతీరంలో ఇంద్ర నేవి విన్యాసాలను రష్యా నౌకాదళాల పరస్పర సహకారానికి ప్రతీకగా నిర్వహించనున్నారు. రెండు రోజులపాటు జరిగే ఈ విన్యాసాలు రెండో ప్రపంచం జరిగి 75 సంవత్సరాలైన తరుణంలో జరగటం వల్ల ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

indra navy excersises in visakha dst
indra navy excersises in visakha dst
author img

By

Published : Sep 4, 2020, 6:09 PM IST

విశాఖలో ఇంద్ర నేవీ విన్యాసాలు

భారత - రష్యా నౌకాదళాల పరస్పర సహకారానికి ప్రతీకగా నిలిచిన ఇంద్ర నేవీ విన్యాసాలు.. విశాఖ తీరంలో జరుగుతున్నాయి. రెండు రోజుల పాటు ఈ విన్యాసాలు అలరించనున్నాయి. రెండో ప్రపంచ యుద్దం జరిగి 75 సంవత్సరాలు పూర్తైన తరుణానికి తోడు.. రష్యా అహ్వానం మేరకు మాస్కోలో రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ పర్యటిస్తున్న సమయంలోనే ఈ విన్యాసాలకు జరగటం వల్ల వీటి ప్రాముఖ్యం పెరిగింది.

ఈ రకమైన విన్యాసాలు నిర్వహించడం ఇది 11వ సారి. కొవిడ్ వల్ల " నాన్ కాంటాక్ట్ , ఎట్ సీ ఓన్లీ " అన్న నినాదంతో ఈ సారి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. భారత యుద్ద నౌకలు ఐఎన్ఎస్ రణ్ విజయ్, సహ్యాద్రి, శక్తి.. ఇందులో పాల్గొంటున్నాయి.

శ్రీలంక తీరంలో ఎంటీ న్యూడైమండ్ నౌక అగ్నిప్రమాదానికి గురికావటం వల్ల దానికి సహాయ పడే పనిలో ఉన్న ఐఎన్ఎస్ సహ్యాద్రి ఆ పనిని పూర్తి చేసుకుని ఈ విన్యాసాలలో పాల్గొంటోంది. రష్యన్ ఫెడరేషన్ నేవికి చెందిన అడ్మిరల్ వినో గ్రదొవ్, అడ్మిరల్ ట్రిబ్యూట్, బొరిస్ బుతొమా కూడా భాగం పంచుకుంటున్నాయి. ఉపరితలం నుంచి గగన తలానికి, ఫైరింగ్ విన్యాసాలు, హెలీకాప్టర్ ఆపరేషన్లు, సీమెన్ షిప్ మదింపు వంటివి ఈ విన్యాసాల్లో ఉంటాయి.

ఇదీ చూడండి:

లాలించే అమ్మ లేక... పాలించే నాన్న లేక!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.