ETV Bharat / state

'మమ్మల్ని త్వరగా భారత్​కు తీసుకెళ్లండి' - అరబ్ దేశాల్లో భారతీయుల కష్టాలు

దుబాయ్​లో ఉన్న భారతీయులు కరోనా కారణంగా తీవ్ర అవస్థలు పడుతున్నారు. వారి వీసా గడువును ఆక్కడి ప్రభుత్వం పొడిగించినప్పటికీ ఉద్యోగాల్లేక చేతిలో డబ్బులు ఖర్చయిపోయి నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరిలో తెలుగువారు కూడా ఉన్నారు. తమను త్వరగా స్వదేశానికి రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని ఓ యువతి కోరింది.

Indians in Dubai facing problems amid corona situations

author img

By

Published : Jun 1, 2020, 1:42 PM IST

దుబాయ్​లోని విశాఖ మహిళ ఆవేదన

దుబాయ్‌ సహా ఇతర దేశాల్లోని విదేశీయులకు వైద్యంతో పాటు అవసరమైన సాయాన్ని అందించేందుకు ప్రభుత్వాలు నిరాకరిస్తున్నాయి. పలితంగా.. ఆయా దేశాల్లోని భారతీయులు తిండికి సైతం ఇబ్బంది పడుతున్నారు. దుబాయ్‌లో భారతీయుల వీసా గడువు పొడిగించనప్పటికీ.. ఉద్యోగాలు, ఆదాయం లేక స్వదేశానికి వచ్చేందుకు వారు ఎదురుచూస్తున్నారు.

8 నెలల క్రితం అక్కడికి వెళ్లిన విశాఖకు చెందిన ఓ తెలుగు జంట.. ఇదే తరహాలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. కరోనా కారణంగా ఉద్యోగాలు పోవటంతో కష్టాలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేసింది. అరబ్ దేశాల్లోని చిక్కుకున్న భారతీయులను వెనక్కి రప్పించేందుకు భారత ప్రభుత్వం విమానాలు నడుపుతున్నా... తమ వంతు ఎప్పుడు వస్తుందన్న నిరీక్షణ వారిని మానసిక వేదనకు గురిచేస్తోందని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వమూ తమను వెనక్కి రప్పించేందుకు ప్రయత్నించాలని వేడుకుంది.

ఇదీ చదవండి:

కొత్తగా 76 కరోనా పాజిటివ్‌ కేసులు..ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.