ETV Bharat / state

గ్యాస్ లీకేజీ భాదితులకు నావికాదళం సహాయం

విశాఖలో గ్యాస్ లీకేజీ ఘటనలోని బాధితులకు.. భారత నావికాదళం ఆక్సిజన్​ని సరఫరా చేసింది. కేజీహెచ్​లో ఉన్న బాధితులకు 5 పోర్టబుల్ మల్టీఫీడ్ ఆక్సిజన్ మానిఫోల్డ్స్ సెట్లను అందించింది.

indian Navy supply oxygen to the visakhapatnam gas leakage victims

author img

By

Published : May 7, 2020, 6:04 PM IST

భారత నావికాదళం... కేజీహెచ్‌కు మరో 5 పోర్టబుల్ మల్టీఫీడ్ ఆక్సిజన్ మానిఫోల్డ్స్ సెట్లను అందించింది. ఈ రోజు ఉదయం విశాఖ ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీక్ వల్ల ప్రభావితమైనవారికి త్వరితగతిన ఆక్సిజన్ అందించడానికి సహకరించింది. నావల్ డాక్ యార్డ్ విశాఖపట్నం (ఎన్డీవీ) నుంచి సాంకేతిక బృందాలు కేజీహెచ్​కు వీటిని సరఫరా చేశాయి.

కొవిడ్-19 మహమ్మారికి ఏకకాలంలో ఆరుగురు రోగులకు ఆక్సిజన్ సరఫరా చేయడానికి ఒక జంబో సైజు ఆక్సిజన్ బాటిల్‌ను ఎనేబుల్ చెయ్యడానికి... ఈ పోర్టబుల్ మల్టీఫీడ్ ఆక్సిజన్ మానిఫోల్డ్ వ్యవస్థను ఎన్డీవీ రూపొందించింది. కొవిడ్ ఆసుపత్రులలో వీటిని ఉపయోగంచటం కోసం... ఇటువంటి 25 సెట్లను జిల్లా పరిపాలన అధికారులకు అందించామని నావికాదళ అధికారి తెలిపారు.

ఇదీ చదవండి:

భోపాల్​ నుంచి విశాఖ వరకు.. చీకటి నింపిన గ్యాస్​ లీక్​లెన్నో...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.