ఆయుర్వేద కోర్సు పూర్తి చేసిన వారి విషయంలో కేంద్రం ఉత్తర్వులకు వ్యతిరేకంగా.. విశాఖ జిల్లా అనకాపల్లిలోని ఎన్టీఆర్ ఆస్పత్రి వద్ద భారతీయ వైద్య మండలి సభ్యులు నిరసనకు దిగారు. ఆధునిక వైద్య విధానంలోని 58 రకాల శస్త్రచికిత్సలను.. ఆయుర్వేద వైద్యులూ నిర్వహించే విధంగా అనుమతించడాన్ని ఐఎంఏ వర్కింగ్ కమిటీ సభ్యుడు డాక్టర్ డీడీ నాయుడు ఖండించారు.
అన్ని వైద్య విధానాలనూ కలిపి చికిత్స అందిస్తే.. ప్రజల ప్రాణాలకు హాని కలుగుతుందని నాయుడు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోను వెంటనే రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ఐఎంఏ అనకాపల్లి సంఘం అధ్యక్షులు డాక్టర్ నాగేశ్వరరావు, కార్యదర్శి మురళితో పాటు ఎన్టీఆర్ జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రావణ్ కుమార్, ఇతర వైద్యులు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: