ETV Bharat / state

ఆ రోజుల్లోనే ఎక్కువ మంది ఆకాశంలో విహరిస్తున్నారు..!

మిగిలిన రోజులు ఓ లెక్క... వారాంతం మరో లెక్క. శని, ఆదివారాల విమాన ప్రయాణాలను విశాఖ వాసులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఆయా రోజుల్లో విశాఖ విమానాశ్రయ పరిసరాలు మరింత సందడిగా మారుతున్నాయి. విమానాల్లో రద్దీ కనిపిస్తోంది.

author img

By

Published : Oct 10, 2021, 1:57 PM IST

increasing-air-travel-on-weekends-at-vizag-airport
ఆ రోజుల్లోనే ఎక్కువ మంది ఆకాశంలో విహరిస్తున్నారు..!
ఆ రోజుల్లోనే ఎక్కువ మంది ఆకాశంలో విహరిస్తున్నారు..!

3 నెలలుగా విశాఖ విమానాశ్రయంలో ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆగస్టులో ఏకంగా లక్షన్నరమంది ప్రయాణించగా... సెప్టెంబరులో లక్షా 36 వేల మంది ప్రయాణించినట్లు అధికారులు చెబుతున్నారు. గులాబ్‌ తుపాను కారణంగా కొంతమంది ప్రయాణాల్ని రద్దు చేసుకున్నప్పటికీ... మిగిలిన రోజుల్లో ప్రయాణికుల సందడి ఆశాజనకంగా ఉంది.

విశాఖ వాసుల్లో కొంతమంది వారాంతాల్లో విమాన ప్రయాణానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. రోజువారీ సగటున 4 వేలమంది వరకు ప్రయాణిస్తుండగా... వారాంతాల్లో ఈ సంఖ్య 6 వేలు దాటిపోతోంది. సెప్టెంబర్‌ వారాంతాల్లో 20 నుంచి 30శాతం అదనంగా ప్రయాణాలు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ రద్దీ కారణంగా విమాన సర్వీసుల్ని కూడా శని, ఆదివారాల్లో ఎక్కువ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

విశాఖ నుంచి ఎక్కువ మంది హైదరాబాద్, బెంగళూరు తదితర నగరాలకు వెళ్తున్నారని అధికారులు అంటున్నారు. దసరా సెలవులకు ప్రయాణాలు మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు. రానున్న రోజుల్లో స్పైస్‌జెట్‌ మరో రెండు కొత్త సర్వీసులు తీసుకొచ్చే అవకాశం ఉంది. విశాఖ-దిల్లీ-శ్రీనగర్, విశాఖ-విజయవాడ-తిరుపతి-పుణె మధ్య సర్వీసుల్ని నడిపేందుకు స్పైస్‌జెట్‌ ఆసక్తిచూపిస్తోంది.

ఇదీ చూడండి: పోలింగ్‌ బూత్‌లో మోహన్‌బాబు ఆగ్రహం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.