Cold intensity: విశాఖపట్నం జిల్లాలోని మన్యంలో చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోయింది. చలిగాలులు విజృంభించడంతో ఏజెన్సీ ప్రజలు బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. అది చాలదన్నట్లు మన్యం ప్రాంతమంతా పొగమంచుతో నిండిపోయి... ఏమీ కనిపించట్లేదు. జిల్లాలోని మినుములూరులో 11, పాడేరులో 13 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతగా నమోదైంది.
ఉదయం తొమ్మిది కావొస్తున్నా... పొగమంచు పేరుకుపోయి చీకట్లు అలముకున్నాయి. దీంతో పాఠశాలలకు, కార్యాలయాలకు వెళ్లే వారు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎముకలు కొరికే చలిలో ఉన్ని దుస్తులు , రగ్గులు కూడా చలి బారి నుంచి రక్షించలేకపోతున్నాయి. గత సం వత్సరంలాగే ఈసారి కూడా చలి ఎక్కువగా ఉంది. గడచిన ఏడాది 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత పడిపోయింది.
ఇదీ చూడండి: Heavy electricity bills for schools: ప్రభుత్వ పాఠశాలలకు గుదిబండగా 'విద్యుత్తు బిల్లులు'