విశాఖ గ్రామీణ జిల్లాలో నాటు సారా అమ్మకాలు జోరందుకున్నాయి. నాటు సారా అమ్ముతూ పట్టుబడే వారికి బెయిల్ మంజూరులో నిబంధనలను ప్రభుత్వం కఠినతరం చేసింది. దీంతో పట్టుబడిన నిందితులను రిమాండు నిమిత్తం సబ్ జైలుకు తరలిస్తున్నారు. వీరికి సకాలంలో బెయిల్ రాక రిమాండులో ఉంటున్నారు. చోడవరం సబ్ జైలులో 52 మంది నిందితులు రిమాండ్లో ఉన్నారు. వీరిలో 45 మంది నాటు సారా అమ్మి పట్టుబడిన వారే కావడం విశేషం.
రిమాండులో ఉన్న తమ వాళ్లను చూసేందుకు బంధువులు చోడవరం సబ్ జైలుకు తరలి వస్తున్నారు. కోవిడ్19 నిబంధనలతో అధికారులు అనుమతిని నిరాకరిస్తున్నారు. అయినా రోజూ జైలు వద్దకు వస్తున్నారు.
ఇదీ చదవండి ఉత్తరాంధ్రపై చంద్రబాబుకు ఎందుకంత కక్ష?: మంత్రి అవంతి