ETV Bharat / state

సంరక్షణ లేమితో కన్నుమూస్తున్న కన్నపేగులు - విశాఖలో లాక్​డౌన్ సమయంలో మాతాశిశు మరణాలు

నవమాసాలు మోసి కన్న బిడ్డను చూసుకునే అదృష్టం లేక.. పలువురు తల్లులు విశాఖ జిల్లాలో గతేడాది విలవిల్లాడారు. ఈ ఏడాది పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. శిశు మరణాలు రేటు తగ్గి.. మాతృత్వ మరణాలలో పెరుగదల నమోదైంది. కొవిడ్ నేపథ్యంలో సరైన పోషకాహారం అందక, వైద్య సిబ్బంది కరోనా విధుల్లో ఉండి సరిగ్గా పట్టించుకోక.. కారణమేదైనా కానీ జన్మనిచ్చిన తల్లులు అధిక సంఖ్యలో అసువులు బాసారు.

increase in mother deaths
కన్నుమూస్తున్న కన్నపేగులు
author img

By

Published : Oct 29, 2020, 9:42 PM IST

మాతృత్వం దేవుడిచ్చిన వరంగా.. అమ్మతనం అమృతభాండంగా భావిస్తారు మహిళలు. గర్భధారణ మొదలుకొని ప్రసవించే వరకు.. పండంటి బిడ్డ కోసం కనిపించిన దేవుళ్లందరికీ మొక్కుతుంటారు. గర్భస్థ సమయంలో తలెత్తే ఆరోగ్య సమస్యలు, పౌష్టికాహార లేమి, రక్తహీనత, సకాలంలో వైద్యం అందకపోవడం తదితర కారణాలతో ప్రసవ సమయంలోనే కొందరు లోకాన్ని వీడుతున్నారు. ప్రసవానంతరం పసి కందుని ఒంటరిని చేసి కన్నుమూస్తున్నారు. మాతాశిశు మరణాల రేటును తగ్గించడానికి ప్రభుత్వాలు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. గర్భిణులు, శిశువుల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాయి. అయినా ఎక్కడోచోట మాతాశిశువుల మృత్యుఘోష వినిపిస్తూనే ఉంది. గతేడాదితో పోల్చితే శిశు మరణాలు తగ్గినా.. మాతృ మరణాలు పెరగడం వైద్యారోగ్యశాఖను ఆందోళనకు గురిచేస్తోంది.

ఇవీ ఉదాహరణలు:

పది రోజుల క్రితం విశాఖ జిల్లా జి.మాడుగుల మండలం రాచవీధికి చెందిన ఓ గర్భిణిని ఆసుపత్రికి తీసుకువెళ్లడం కోసం.. ఆమె బంధువులు అంబులెన్స్‌కు ఫోన్‌ చేశారు. మీ గ్రామం వరకు వాహనం రాదనీ.. అనర్బ వరకు ఆమెను తీసుకురమ్మని సిబ్బంది సూచించారు. గర్భిణిని అనర్బకు తరలించి అంబులెన్స్‌లో ఆస్పత్రికి వెళుతుండగా.. మార్గంమధ్యలోనే తనువు చాలించింది.

కొయ్యూరు మండలం చీడిపాలెంకు చెందిన ఓ మహిళ.. ప్రసవ సమయంలో రక్తస్రావం ఎక్కువ కావడంతో బిడ్డకు జన్మనిచ్చిన కొద్దిరోజులకే చనిపోయింది. పాడేరు మండలం సప్పిపట్టుకు చెందిన వంతల సత్యవతి.. మర్రివాడ గ్రామసచివాలయంలో ఉద్యానవనశాఖ సహాయకురాలిగా పనిచేస్తోంది. కాకినాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ప్రసవం కోసం చేరింది. వైద్యులు సిజేరియన్‌ చేసి బిడ్డను తీసిన అనంతరం తీవ్ర అస్వస్థతకు గురై.. బిడ్డను చూడకుండానే కన్నుమూసింది.

మాతాశిశు సంరక్షణ విధానం:

జిల్లావ్యాప్తంగా ఏటా 80 వేలకుపైగా గర్భిణిలు ఆరోగ్యశాఖ రికార్డుల్లో నమోదవుతుంటారు. గర్భం మొదలైన నాటి నుంచి ఆమె ఆరోగ్యంపై సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంటారు. ప్రతినెలా వైద్యులతో చెకప్‌లు చేయించి.. కడుపులో బిడ్డ పరిస్థితి ఎలా ఉందో నిర్ధారించే పరీక్షలు చేస్తుంటారు. ప్రసవానికి వారం రోజుల ముందే అప్రమత్తం చేసి.. ఆస్పత్రిలో చేరే విధంగా ప్రోత్సహిస్తుంటారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండటంతో.. ఏటా మాతాశిశు మరణాల రేటు తగ్గుతూ వస్తోంది. ఈ ఏడాది మాత్రం భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. గతేడాదితో పోలిస్తే మాతృమరణాలు పెరిగి.. శిశు మరణాలు తగ్గాయి. ఆస్పత్రి ప్రసవాలు పెరగడంతో.. శిశు మరణాల సంఖ్య తగ్గింది. పౌష్టికాహార లోపంతో పాటు రక్తహీనత, ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా మాతృమరణాలు ఎక్కువగా నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ చెబుతోంది.

కరోనాతో సేవలు దూరం:

ఈ ఏడాది కరోనా వైరస్‌ కలకలం మొదలుకొని.. గర్భిణుల ఆరోగ్యంపై వైద్యారోగ్యశాఖ పెద్దగా దృష్టి సారించలేదు. తొలి మూడు నెలల లాక్‌డౌన్‌లో రవాణా సదుపాయాలు లేకపోవడంతో.. క్షేత్రస్థాయి సిబ్బంది గర్భిణుల దగ్గరకు వెళ్లలేకపోయారు. ఆ సమయంలో ఆసుపత్రుల్లో సేవలు కూడా అంతంత మాత్రం అందాయి. వైద్య, ఆరోగ్య సిబ్బంది అంతటికీ కొవిడ్‌ విధులు కేటాయించడంతో.. గర్భిణుల గురించి పట్టించుకోలేదు. బయటకు వెళితే వైరస్‌ ఎక్కడ సోకుతుందోనని కుటుంబ సభ్యులు ఆసుపత్రి తనిఖీలకు కూడా తీసుకువెళ్లేవారు కాదు. అంగన్‌వాడీ కేంద్రాలన్నీ మూతపడ్డాయి. పౌష్టికాహారం అందే పరిస్థితి లేకుండా పోయింది. ఇవన్నీ వెరసి పసిగుడ్డులకు మాతృమూర్తులను దూరం చేశాయి.

మాతాశిశు సంరక్షణకు ప్రత్యేక చర్యలు:

"మాతాశిశు మరణాల రేటును గతేడాది వరకు బాగా తగ్గించగలిగాము. ఎక్కువ మంది రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధిత సమస్యలతో చనిపోయారు. పౌష్టికాహార లోపంతో చనిపోయింది.. ఒకరిద్దరకు మించి లేరు. ఈ మరణాల రేటును తగ్గించడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం" - డా.సూర్యనారాయణ, డీఎంహెచ్‌వో, విశాఖపట్నం.

************2019 ఏప్రిల్‌-సెప్టెంబర్‌2020 ఏప్రిల్‌-సెప్టెంబర్
మాతృ మరణాలు 27 36
శిశు మరణాలు 440 331

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.