సింహాద్రి అప్పన్న క్షేత్రపాలకుడైన కాలభైరవ స్వామి... దీపాల వెలుగులో, కళ్లు మిరుమిట్లు గొలిపేలా దర్శనమిచ్చాడు. ఈ ఆలయంలో ప్రతి మాసంలో వచ్చే అమావాస్య నాడు స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. కాలభైరవున్ని దర్శించుకుంటే కోరికలు తీరుతాయని, సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. రాష్ట్ర నలుమూలల నుంచి అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ఈ స్వామిని దర్శించుకోవడం కోసం సందర్శకులు భారీగా వస్తుంటారు. ఇందులో భాగంగానే.. గురువారం పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయాన్ని దర్శించారు.
ఇది చూడండి:పరుగుల రాణిని... ఆర్థిక పరిస్థితి వెక్కిరిస్తోంది!