ETV Bharat / state

"జగన్‌ మంచి పరిపాలన అందిస్తే.. మళ్లీ సినిమాలు చేసుకుంటా" - pawan speech at long march in vishaka

ప్రజల ఆవేదనే నన్ను రాజకీయాల్లోకి తీసుకువచ్చిందని జనసేనాని అన్నారు. ప్రజలకు మంచి పరిపాలన అందితే నేను రాజకీయాల్లోకి రావల్సిన అవసరమే లేదని చెప్పారు.

పవన్
author img

By

Published : Nov 3, 2019, 7:21 PM IST

తాను అధికారం కోసం అర్రులు చాచే వ్యక్తిని కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కోట్ల సంపాదన వచ్చే సినిమాలను కూడా ప్రజల కోసమే వదులుకున్నానని విశాఖలోని సభలో జనసేనాని చెప్పారు. పాత జైలురోడ్డు ఎదురుగా జనసేన లాంగ్‌మార్చ్ సభలో ఆయన ప్రసంగించారు. "నేను డబ్బుతో పార్టీని నడిపే వ్యక్తిని కాదు, భావజాలంతో నడుపుతున్నాను. తెలంగాణలో ఆర్టీసీ కార్మికులకు కూడా అండగా నిలబడ్డాను. దత్తపుత్రుడు, బి-టీమ్‌ అని వైకాపా నాకు పేర్లు పెట్టింది. వైకాపా విమర్శలకు బలంగా సమాధానం చెప్తా. ఎంత ఆవేదన ఉంటే ఇంతమంది రోడ్ల మీదకు వచ్చారు. ప్రభుత్వం సరిగా పని చేయనందునే ఇంతమందిలో ఆవేదన పెరిగింది. భవన నిర్మాణ కార్మికుల కష్టాలు నా మనసుకు బలంగా తాకాయి. ఇసుక కొరత వల్ల అభివృద్ధి ఆగిపోతోంది. ఎన్నికల్లో ఓడిపోయానని అలుసా.. ప్రజల గుండె‌ల్లో స్థానమే నాకు పెద్ద పదవి. ప్రజలకు మంచి పరిపాలన అందితే నేను రాజకీయాల్లోకి రావల్సిన అవసరమే లేదు. జగన్‌ మంచి పరిపాలన అందిస్తే.. నేను వెళ్లి మళ్లీ సినిమాలు చేసుకుంటా" అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

విశాఖలోని బహిరంగసభలో పవన్ ప్రసంగం

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.