విశాఖ నేవల్ డాక్ యార్డ్ అడ్మిరల్ సూపరింటెండెంట్‌గా రియర్ అడ్మిరల్ ఐబీ ఉత్తయ్య బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఈ బాధ్యతను నిర్వర్తిస్తున్న రియర్ అడ్మిరల్ శ్రీకుమార్ నాయర్‌కి వైస్ అడ్మిరల్‌గా పదోన్నతి లభించింది. విశాఖలోని డైరక్టర్ జనరల్ నేవల్ ప్రాజెక్ట్స్‌కు బదిలీ అయ్యారు. రియర్ అడ్మిరల్ ఉత్తయ్య.. 1987లో నౌకాదళంలో కమిషన్ అధికారిగా చేరారు. 33 ఏళ్ల పాటు నేవీలో వివిధ హోదాలలో సేవలందించి పలు కీలక ఆపరేషన్లలో భాగస్వామి అయ్యారు. వార్ షిప్ డిజైన్ డైరక్టరేట్, ట్రైనింగ్ అకాడమీలు, నేవల్ డాక్ యార్డులు, నేవల్ హెడ్ క్వార్టర్స్‌లలో బాధ్యతలు నిర్వర్తించారు. రియర్ అడ్మిరల్ ర్యాంకు పొందిన తర్వాత ఆయన హెడ్ క్వార్టర్స్‌లో అదనపు డైరక్టర్ జనరల్ (టెక్నికల్) గా సేవలందిచారు. నేవల్ వార్ కాలేజీ పూర్వ విద్యార్దిగా విశిష్ట సేవా మెడల్‌ను సాధించిన ఉత్తయ్య... భారత్ - రష్యా యుద్ద నౌకల తయారీ ప్రాజెక్టులలో కీలక పాత్ర పోషించారు.
ఇదీ చదవండి: అనకాపల్లిలో రూ.500కోట్లతో మెడికల్ కళాశాల నిర్మాణం