విశాఖ జిల్లాలో కొవిడ్ బాధితుల చికిత్స కోసం.. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సరఫరా కోసం హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ విశాఖ రిఫైనరీ విరాళం అందించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొవిడ్ రోగులకు ఆక్సిజన్ సరఫరా కోసం రూ.35 లక్షల మొత్తాన్ని ఇచ్చింది.
హెచ్‌పీసీఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి.రత్నరాజ్.. ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును కలెక్టర్ వి.వినయ్ చంద్‌కు అందజేశారు. దేశంలో పెరుగుతున్న కొవిడ్ రోగులకు ఆక్సిజన్ కోసం హెచ్‌పీసీఎల్ సామాజిక బాధ్యతగా ఈ రకమైన విరాళాలు అందిస్తోందని రత్నరాజ్ వివరించారు.
ఇవీ చూడండి: