ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించిన కోకా సుబ్బారావు స్మారకోపన్యాసం.. సబ్బవరంలోని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో జరిగింది. రాజ్యాంగం - న్యాయం అందించడంలో మార్పులు అనే అంశంపై రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి సి. ప్రవీణ్ కుమార్ ప్రసంగించారు. సహజ న్యాయసూత్రాలను అనుసరించి ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలపై రాజ్యాంగం అత్యంత ప్రాధాన్యం ఇచ్చిందని జస్టిస్ ప్రవీణ్ కుమార్ ఆన్నారు. క్రిమినల్ న్యాయశాస్త్రంలో ప్రాథమిక హక్కులు చాలా కీలకంగా పరిశీలించాల్సి ఉంటుందన్నది పలు కేసుల్లో ఇచ్చిన తీర్పులలో కన్పిస్తుందని చెప్పారు.
ఇదీ చదవండి :