విశాఖలో గొర్లె సూర్యనారాయణ రచించిన భారతీయం నాడు-నేడు పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఇందులో హిందూ దేవాలయాలు, రంగనాధ స్వామి ఆలయం నుంచి తాజ్ మహల్ గుప్తగాధ వరకు.. ఉగాది నుంచి దీపావళి వరకు పండగలు విశేషాలను.. ప్రస్తుత పరిస్ధితులకు అన్వయిస్తూ విశదీకరించారు. మాతృభాషలో ఈ తరహా గ్రంధాల వల్ల.. వీటి ప్రాశస్త్యాన్ని పెద్దలు మళ్లీ పిల్లలకు గుర్తు చేసే విధంగా ఉంటుందని రాయ్ అన్నారు. చిన్నతనం నుంచి వారికి సంస్కృతి, సంప్రదాయాలు, పండగలు, విలువలు, ప్రదేశాల ప్రాశస్త్యాలు చెప్పగలిగితే.. వారికి అవి తరగని ఆస్తిగా.. జీవితాంతం దిక్సూచిగా ఉంటాయని పేర్కొన్నారు.
ఇవీ చూడండి...