ETV Bharat / state

సింహగిరిపై హీరో శర్వానంద్​ సందడి - simhachalam latest news

విశాఖ సింహగిరిపై హీరో శర్వానంద్​ సందడి చేశారు. సింహగిరిపై 'మహా సముద్రం' సినిమా షూటింగ్​ జరిగింది. అనంతరం హీరో శర్వానంద్ సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు.

hero sharwanandh at simhachalam
సింహగిరిపై హీరో శర్వానంద్​ సందడి
author img

By

Published : Mar 30, 2021, 2:11 PM IST

hero sharwanandh at simhachalam
సింహగిరిపై హీరో శర్వానంద్​ సందడి

విశాఖ శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారిని ప్రముఖ సినీ కథానాయకుడు శర్వానంద్‌ దర్శించుకున్నారు. కప్పస్తంభం ఆలింగనం చేసుకుని బేడామండపం ప్రదక్షిణం చేశారు. అంతరాలయంలో స్వామిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. పండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. ఈవో సూర్యకళ స్వామివారి ప్రసాదం అందజేశారు.

hero sharwanandh at simhachalam
సింహగిరిపై హీరో శర్వానంద్​ సందడి

సింహగిరిపై ‘మహా సముద్రం’ చిత్రీకరణ

ఆర్‌ఎక్స్‌-100 ఫేమ్‌ అజయ్‌ భూపతి దర్శకత్వంలో రూపొందుతున్న మహా సముద్రం చిత్రం షూటింగ్‌ సోమవారం సింహగిరిపై ఆలయ ప్రాంగణంలో జరిగింది. ప్రముఖ కథానాయకుడు శర్వానంద్‌, కథానాయిక ఆదితీరావు హైదరీ ముఖ్య పాత్రధారులుగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ 90 రోజుల పాటు విశాఖ పరిసరాల్లో జరుగుతుందని చిత్ర యూనిట్‌ తెలిపింది. సింహగిరిపై జరిగిన ఒకరోజు షూటింగ్‌లో ఆధ్యాత్మిక ప్రవచనాలు, కథానాయిక కుటుంబ సభ్యులకు సంబంధించి సన్నివేశాలను చిత్రీకరించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రాన్ని అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు.

hero sharwanandh at simhachalam
సింహగిరిపై హీరో శర్వానంద్​ సందడి

అప్పన్న స్వామికి ముత్యాల తలంబ్రాలు బహూకరణ:

శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి వార్షిక తిరుకల్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఒక కిలో ముత్యాల తలంబ్రాలను బహూకరించింది. సంస్థ ప్రతినిధుల తరఫున చిత్ర దర్శకుడు అజయ్‌ భూపతి ముత్యాల తలంబ్రాలను ఆలయ సూపరింటెండెంట్‌ దాసరి బంగారునాయుడికి అందజేశారు. కార్యక్రమంలో ప్రముఖ ప్రవచనకర్త నండూరి శ్రీనివాస్‌, కళా దర్శకుడు శ్రీనివాస్‌, మేనేజర్‌ శ్రీరామచంద్రమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: పోలవరం మూలలంకలో ఎన్జీటీ సంయుక్త కమిటీ పర్యటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.