విశాఖ జిల్లాలోని తొట్లకొండ బౌద్ధరామాల భూములను పరిరక్షించి, భవిష్యత్ తరాలకు అందించాలని హెరిటేజ్ నేరేటర్లు సోహన్ హతంగి, జయశ్రీ హతంగి అన్నారు. ఈ సందర్భంగా తొట్లకొండ పరిసర ప్రాంతాలను ప్రజా ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. కేవలం 120 ఎకరాలను మాత్రమే ప్రభుత్వం ఢీనోటిఫై చేసిందన్న వారు.. మిగతా భూములను కూడా వారసత్వ సంపదగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. జీవో 21ను కూడా రద్దు చేయాలని అన్నారు.
బౌద్ధ భిక్షువులు సంచరించిన ఈ ప్రాంతాన్ని సురక్షితంగా ఉంచాలని ఈ ప్రాంత ఔన్నత్వాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేయాలన్నారు. సర్వే నంబర్లు మార్చి..ఇతర నిర్మాణాలకు ఈ స్థలాలను కేటాయిస్తే ఊరుకునేది లేదని వారు హెచ్చరించారు.
ఇదీ చదవండి: