రహదారి గండిపడటంతో అత్యవసర రోగిని జేసీబీ సహాయంతో అవతలి ఒడ్డుకి చేర్చారు. విశాఖ జిల్లా ధారకొండ-గుమ్మిరేవుల రహదారిలో కొంగపాకలు వద్ద రహదారికి గండిపడింది. అదే సమయంలో గుమ్మిరేవుల పంచాయతీ నేలజర్తకు చెందిన గిరిజన మహిళ అనారోగ్యానికి గురవ్వడంతో ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. ఈ మేరకు స్పందించిన స్థానికులు.... గండిపూడ్చటానికి వచ్చిన జేసీబీ తొట్టెలో ఆమెను ఎక్కించి సహాయం అందించారు. వర్షాలు పడితే రహదారికి గండిపడుతుందని... రాకపోకలు నిలిచిపోతున్నాయి ప్రయాణికులు అంటున్నారు. అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: 'జగన్ కేబినెట్ మంత్రులంతా డమ్మీలు '