ETV Bharat / state

పక్క రాష్ట్రాల నుంచి జోరుగా ఇసుక రవాణా.. ప్రభుత్వ రిచ్​ల్లో ఇసుక నిల్వలు - ప్రభుత్వ ఇసుక రీచుల్లో పేరుకుపోయిన ఇసుక తాజా వార్తలు

రాష్ట్రంలో ఓ వైపు ఇసుకు అక్రమ రవాణా దారులు రెచ్చిపోతుంటే.. మరో వైపు వినియోగదారులు పక్క రాష్ట్రాలవైపు చూస్తున్నారు. ఇక్కడ కంటే అక్కడ తక్కువ ధరకు ఇసుక దొరుకుతుండటం.. సకాలంలో సరఫరా అవుతుండటంతో.. ఆయా రాష్ట్రాల నుంచి ఇసుక తెచ్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.

sand transport
ప్రభుత్వ రిచ్​ల్లో ఇసుక నిల్వలు
author img

By

Published : Dec 8, 2020, 11:36 AM IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇసుక ఆన్​లైన్​ విధానంలో ధర కంటే.. పక్క రాష్ట్రమైన ఒడిస్సాలో తక్కువ ధరకు ఇసుక లభిస్తుంది. సకాలంలో అక్కడి నుంచి ఇసుక సరఫరా చేస్తుండటం కూడా ఎక్కువ మంది అక్కడ నుంచి ఇసుకను తెచ్చుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. రాష్ట్రంలో ఇసుక కావాలంటే ఆన్​లైన్​లో బుక్ చేసుకోవాలి. ఒక్కోసారి సర్వర్ పనిచేయకపోవటం, సర్వర్ పని చేసిన డిపో నుంచి ఇసుక రావటానికి రోజుల తరబడి సమయం పడుతుంది. ఈ ఇబ్బందులన్నీ పడలేక విశాఖ నగరంతో పాటు.. పరిసర ప్రాంతాల నిర్మాణదారులు ఒడిస్సా నుంచి ఇసుకను కొనుగోలు చేయడానికే ఆసక్తి చూపుతున్నారు.

రాష్ట్రంలో నూతన ఇసుక విధానం అమలులోకి తెచ్చిన తరువాత సామాన్య ప్రజల నుంచి భవన నిర్మాణదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ఇసుక బుక్ చేసుకున్న వారికి సకాలంలో సరఫరా చేయలేకపోతోంది. ఈ సమస్య మొదటి నుంచి ఉన్నప్పటికీ సరిదిద్దు కోలేకపోతున్నారు. జిల్లా స్థాయి అధికారులు పలుమార్లు ఈ సమస్యను ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన పరిష్కారం చూపలేక పోతున్నారు.

జిల్లాలో ఇసుక డిమాండ్​ను గుర్తించిన కొందరు వ్యాపారులు ఒడిస్సా వ్యాపారులతో ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. అక్కడ ఆధార్ నెంబర్​పై ఇసుక బుక్ చేసుకునే వెసులుబాటు కూడా ఉందని లబ్ధిదారులు వాపోతున్నారు. ఒడిశాలోని రాయగడ, కాశీ నగర్, బరంపురం, కటక్ లతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో ఉన్న నదులు ద్వారా ఇసుక పుష్కలంగా లభ్యమవుతుంది. దీంతో ఒడిశా నుంచి విశాఖ మీదుగా విజయవాడ, రాజమండ్రి ప్రాంతాలకు ఇసుక రవాణా చేస్తున్నారు.

ఒడిస్సా రీచ్​ల వద్ద 10 వేలు చెల్లిస్తే 40 టన్నుల పైగా ఇసుక లోడ్ చేసుకునే వెసులుబాటు ఉంది. లారీ అద్దెతోపాటుగా టోల్ గేట్లు, ఇతర ఖర్చులు మొత్తం అంతా కలిపినా 25 నుంచి 30 వేలు లోపు ఖర్చవుతుంది. అదే విశాఖలో 50 వేల నుంచి 60 వేల వరకు విక్రయిస్తున్నారు. మొత్తంగా కలిపి చూసుకుంటే టన్ను ఇసుకకు రెండు నుంచి మూడు వందల రూపాయల వరకు వ్యత్యాసం కనిపిస్తోంది. దీంతో విశాఖ నగరంలో ఒడిస్సా ఇసుక వ్యాపారం జోరుగా కొనసాగుతోంది. ఇసుక వ్యాపారులకు అధికారులతో ఉన్న పరిచయాలతో చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

ఒడిస్సా ఇసుక రాకతో జిల్లాలోని ప్రభుత్వ డిపోల్లో వ్యాపారం గణనీయంగా తగ్గిపోయింది. మూడు నాలుగు నెలల క్రితం జిల్లాలో అన్ని డిపోల ద్వారా రోజుకి ఆరేడువేల టన్నుల ఇసుక అమ్మితే ప్రస్తుతం రెండు నుంచి మూడు వేల టన్నులు మాత్రమే అమ్మకాలు చేస్తున్నారు. దీంతో జిల్లాలోని ఆరు డిపోల్లో 2.8 లక్షల టన్నుల ఇసుక నిల్వలు పేరుకుపోయాయి. ఇదిలా కొనసాగుతుండగా కొత్తగా కొందరు బిల్డర్లు, గుత్తేదారులు ఒడిశా ఇసుక వ్యాపారంలోకి దిగారు. కొంతమంది పెద్ద మొత్తంలో ఆర్డర్లు తీసుకొని తమ అవసరాలకు పోను మిగిలిన మొత్తాన్ని తాపీ మేస్త్రి ద్వారా నిర్మాణదారులకు అడ్డదారుల్లో ఇసుక విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇవీ చూడండి...

'పన్ను రిటర్న్​ దాఖలు చేసిన బియ్యం కార్డుదారులకు రేషన్​ నిలిపివేత'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.