మన్యంలో పొంగుతున్న వాగులు - rain news in andhrapradesh
విశాఖ మన్యంలో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగుతున్నాయి. జి.మాడుగుల, పాడేరు, పెదబయలు మండలాల గుండా ప్రవహించే మత్స్యగెడ్డ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పెదబయలు మండలం పరదానిపుట్టు వంతెనపై నుంచి గెడ్డ పొంగి ప్రవహించడం ఇబ్బందికరంగా మారింది. వంతెనపై భారీగా నీరు ప్రవహిస్తున్నా మారుమూల గిరిజనులు జీపులపై ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు