గత కొద్ది రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు విశాఖ మన్యంలోని వాగులు.. వంకలు పొంగి పొర్లుతున్నాయి. పాడేరు మండలం పరదానిపుట్టు వంతెనపై నుంచి వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఫలితంగా పెదబయలు, పాడేరు మండలాల్లోని వందలాది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మత్స్యగెడ్డ ప్రవాహం అధికమై అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జి మాడుగుల మండలం బోయితలి, కుంబిడిసింగి, కిల్లంకోల గ్రామాల్లో కాలువలు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. అధికారులు స్పందించి వెంటనే కాలువల వద్ద వంతెనలు నిర్మించాలని మన్యం వాసులు వేడుకుంటున్నారు.
ఇదీ చూడండి: