బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరికొద్ది గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారుతుందని భారత వాతావరణ విభాగం తెలిపింది. పోర్ట్ బ్లెయిర్‌కు వాయవ్యంగా దాదాపు 300 కిలోమీటర్లకుపైగా దూరంలో కేంద్రీకృతమై వాయుగుండం, క్రమంగా ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతూ అక్టోబర్ 24 ఉదయం నాటికి తుాపానుగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. ఇది అక్టోబరు 25వ తేదీన టింకోనా ద్వీపం, శాండ్‌విప్ మధ్య బంగ్లాదేశ్‌లో తీరాన్ని దాటుతుందనీ ఐఎండీ అంచనా వేసింది. దీని ప్రభావంతో నేటి నుంచి మూడురోజుల పాటు..ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల వెంబడి మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణశాఖ అధికారులు చెప్పారు.
ఇవి చదవండి: