ETV Bharat / state

భారీ వర్షానికి రహదారులు జలమయం - payakaraopeta

విశాఖ జిల్లా పాయకరావుపేటలో గురువారం కురిసిన భారీ వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల వర్షం నీరు చేరినందున వాహనదారులు ఇబ్బందిపడ్డారు.

భారీ వర్షానికి రహదారులు జలమయం
author img

By

Published : Aug 2, 2019, 8:07 AM IST

భారీ వర్షానికి రహదారులు జలమయం

విశాఖపట్నం జిల్లా పాయకరావుపేటలో రాత్రి భారీ వర్షం కురిసింది. రహదారులన్నీ జలమయమయ్యాయి. పల్లపు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరినందున ప్రజలు ఇబ్బందులు పడ్డారు. నాగరాజుపేట, ముస్లిం కాలనీ, తదితర ప్రాంతాల్లో వర్షం నీరు చేరుతుంది. లక్ష్మి థియేటర్ వద్ద ప్రధాన రహదారిపై వర్షం నీరు నిలిచిపోయినందున వాహనదారులు అవస్థలు పడ్డారు.

భారీ వర్షానికి రహదారులు జలమయం

విశాఖపట్నం జిల్లా పాయకరావుపేటలో రాత్రి భారీ వర్షం కురిసింది. రహదారులన్నీ జలమయమయ్యాయి. పల్లపు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరినందున ప్రజలు ఇబ్బందులు పడ్డారు. నాగరాజుపేట, ముస్లిం కాలనీ, తదితర ప్రాంతాల్లో వర్షం నీరు చేరుతుంది. లక్ష్మి థియేటర్ వద్ద ప్రధాన రహదారిపై వర్షం నీరు నిలిచిపోయినందున వాహనదారులు అవస్థలు పడ్డారు.

ఇదీ చదవండి :

సిబ్బంది నిర్లక్ష్యమే ఆమె ప్రాణం తీసింది

Intro:Mlc Elections Race in YsrcpBody:AP_VJA_11_02_MLC_RACE_IN_YSRCP_PKG_3068069
Reporter_M.Venkata Ramana 02-08-2019
NOTE_ USE FILE VISUALS

( ) రాష్ట్రంలో ఎమ్మెల్సీ పదవుల భర్తీకి తెర లేచింది. అధికార వైకాపా లో ఎమ్మెల్సీ పదవుల రేసు మొదలైంది. ఖాళీ అయిన పదవుల భర్తీకి ఈసీ చర్యలు తీసుకోవడంతో ఈ పదవులు ఎవరకి దక్కుతాయనే దానిపై పార్టీలో విస్తృత చర్చ నడుస్తోంది. ఎమ్మెల్సీ సీట్ల భర్తీకి షెడ్యూల్ రావడంతో వీటిని దక్కించుకునేందుకు నేతలు ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. పోటీ ఎక్కువగా ఉండటంతో ఎవరికి పదవి వరిస్తుందనే విషయమై స్పష్టత రావడం లేదు. సీఎం రాష్ట్రానికి వచ్చాక మరి కొద్ది రోజుల్లో వీటిపై నిర్ణయం తీసుకోనున్నారు....LOOK

వాయిస్ ఓవర్ - ఎపీలో ఖాళీ అయిన 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. సాధారణ ఎన్నికల ముందు ఎమ్మెల్సీలుగా ఉన్న నేతలు వారి పదవులకు రాజీనామా చేయడంతో ఖాళీలు ఏర్పడ్డాయి. తెలుగు దేశం పార్టీ నుంచి ప్రకాశం జిల్లాకు చెందిన కరణం బలరాం, వైకాపా నుంచి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఆళ్లనాని,విజయనగరం జిల్లాకు చెందిన కోలగట్ల వీరభద్ర స్వామి ఎన్నికల్లో శాసన సభకు పోటీ చేసి గెలిచారు. రెండు స్థానాల్లో కొనసాగకూడదు కాబట్టి ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. వీటిని భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. షెడ్యూల్ విడుదల కావడంతో అధికార వైకాపాలో ఎమ్మెల్సీపదవులు ఎవరికి దక్కుతాయనే విషయం చర్చనీయాంశమైంది. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే వస్తోన్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుండటంతో పోటీ ఎక్కువగానే ఉంది. ఎన్నికలల్లో టికెట్ ఆశించిన భంగపడిన వారు, ఓడిన వారు , ఎన్నికల్లో ఎమ్మెల్యేను గెలిపించుకునేందుకు పనిచేసిన ద్వితీయ శ్రేణి నేతలు ఎమ్మెల్సీ పదవులపై ఆశలు పెట్టుకున్నారు . పార్టీలో చాలా మందికి ఎమ్మెల్సీ టికెట్ పై అధిష్టానం హామీ ఇచ్చింది. ఎవరికి దక్కుతుందనే దానిపై నేతలకు స్పష్టత లేదు. గత ఎన్నికల్లో గుంటూరు జిల్లా రేపల్లె శాసన సభ స్థానం నుంచి పోటీ చేసిన మోపిదేవి వెంకటరమణారావు ఓటమి పాలయ్యారు. అయినా పార్టీకి అందించిన సేవలు, విధేయత ప్రామాణికంగా తీసుకున్న జగన్.. ఆయన్ను మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. సాధారణంగా మంత్రిగా నియమితులైన వారు శాసన సభ లేదా శాసన మండలికి ఆరు నెలల్లో ఎన్నిక కావాల్సి ఉంది. శాసన సభకు ఎన్నికయ్యే అవకాశాలు లేకపోవడం తో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని జగన్ నిర్ణయించారు. ఇప్పటికే రెండు నెలలు గడిచింది. సమీపంలో ఖాళీ అయ్యే స్థానాలు కూడా లేని కారణంతో ప్రస్తుత నోటిఫికేషన్ లో మోపిదేవి కి ఎమ్మెల్సీ పదవి ఖాయంగా కనిపిస్తోంది. మిగిలిన రెండు స్థానాలకు వైకాపా లో గట్టి పోటీ నెలకొంది. తమకు అవకాశం ఇవ్వాలని ఇప్పటికే పలువురు వైకాపా నేతలు జగన్ ను కలసి విన్నవించుకున్నారు. ఎన్నికల సమయంలో ఎమ్మెల్సీ పదవిపై హామీ పొందిన వారు సహా ఇతర నేతలూ ఉన్నారు. శాసన సభ ఎన్నికల్లో అనంతపురం జిల్లా హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణపై పోటీ చేసి ఓడిన విశ్రాంత పోలీసు ఉన్నతాధికారి మహ్మద్ ఇక్బాల్ కు ఎమ్మెల్సీ ఇస్తానని జగన్ కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. ముస్లింలకు తగిన ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇవ్వడంతో ఒక ఎమ్మెల్సీ పదవి కేటాయించే అవకాశాలున్నాయి. ఇదే సామాజిక వర్గం లో సినీనటుడు అలీ కి ఎమ్మెల్సీ స్థానం దక్కవచ్చని అంటున్నారు. ఎన్నికల ముందు వైకాపాలో చేరిన అలీ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేసి పార్టీ గెలుపునకు కృషి చేశారు. తనకు అవకాశం కల్పించాలని కోరడంతో ఆయన అభ్యర్థిత్వాన్ని పరిశీలించే అవకాశాలున్నట్లు తెలిసింది. మరో సామాజిక వర్గానికి ఇవ్వాలని భావిస్తే మరి కొంత మంది నేతలు రేసులో ఉన్నారు. కడప జిల్లా రాజం పేట స్థానాన్ని త్యాగం చేసిన ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి కి ఎమ్మెల్సీ సీటు పై జగన్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. తెదేపా నుంచి వచ్చిన మేడా మల్లి కార్జున రెడ్డిని రాజంపేట నుంచి ఎన్నికల ముందు బరిలో నిలిపిన జగన్.. అధికారం లోకి రాగానే తగిన ప్రాధాన్యత ఇస్తానని ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డికి అభయమిచ్చారు. తితిదే ఛైర్మన్ పదవి లేదా ఎమ్మెల్సీ తోపాటు ప్రొటో కాల్ హోదా కల్గిన పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లు అనుచరులు చెబుతున్నారు. తితిదే ఛైర్మన్ పదవిని వైవీ సుబ్బారెడ్డికి ఇవ్వడంతో ఆకేపాటి ని శాసన మండలికి పంపుతారనే ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ముందు పార్టీ లో చేరినా వివిధ కారణాలతో చివరి నిముషంలో సీటు ఇవ్వలేకపోయిన పండుల రవీంద్ర బాబుకు ఎమ్మెల్సీ ఇవ్వొచ్చనే ప్రచారం జరుగుతోంది. గుంటూరు జిల్లా లో చిలకలూరి పేట నుంచి తొలినుంచీ పార్టీ కోసం పనిచేసిన మర్రి రాజశేఖర్ కు చివరి నిముషంలో సీటు దక్కలేదు. ఆ స్థానం విడదల రజనికి ఇచ్చి త్యాగం చేసినందుకు మర్రి రాజశేఖర్ ను ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇస్తానని వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారంలో బహిరంగంగా హామీ ఇచ్చారు. మర్రి రాజశేఖర్ అభ్యర్థిత్వాన్నీ పరిశీలించే అవకాశం లేకపోలేదంటున్నారు. కర్నూలు జిల్లా బనగాన పల్లి నియోజక వర్గానికి చెందిన సీనియర్ నేత చల్లా రామకృష్ణారెడ్డి ఎన్నికల ముందు తెదేపా ను వీడి వైకాపాలో చేరారు. పార్టీ అధికారంలోకి వస్తే తగిన ప్రాధాన్యత ఇస్తామని అధిష్టానం నుంచి హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని చల్లా వర్గీయులు కోరుతున్నారు. వీరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలువురు నేతలు తమకు అవకాశం ఇవ్వాలని ఇప్పటికే వైఎస్ జగన్ ను కలసి కోరారు. తొలి నుంచీ పార్టీ అభివృద్దికి కృషి చేసినా... సామాజిక సమీకరణాలు సహా ఆర్థిక పరమైన సమస్యలతో సీటు దక్కించుకోలేక పోయిన పలు నియోజక వర్గాలకు చెందిన నేతలు తమ సేవలకు గుర్తింపు ఇచ్చి ఎమ్మెల్సీ సీటు ఇవ్వాలని కోరుతున్నారు. తమ పార్టీ ముఖ్యులను కలసి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. కొందరు ద్వితీయ శ్రేణి నేతలు కూడా తమకు ఎమ్మెల్సీ సీటు కోసం ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిలో ఎవరికి పదవి వరిస్తుందనేది మరి కొద్ది రోజుల్లోనే తేలనుంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జెరుసలేం పర్యటనలో ఉన్నారు. ఈనెల 5 న తిరిగి విజయవాడ వస్తారు. సీఎం వచ్చాక ఆశావహులు మరోసారి కలిసి తమ కోరిక నెరవేర్చాలని కోరే అవకాశాలున్నాయి. ఈ సారి ఎవరికి అవకాశం ఇవ్వాలనే విషయమై పార్టీ వర్గాలతో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు....END
Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.