విశాఖపట్నంలో భారీ వర్షం కురిసింది. ఉదయం కొంచెం మబ్బులు, ఎండగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయి కుండపోత వర్షం కురిసింది. విజయ దశమి కావడం వల్ల ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు బయటకు వచ్చిన విశాఖ వాసులు ఇబ్బందులు పడ్డారు. దాదాపు గంటసేపు కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.
ఇదీ చూడండి: భారీ వర్షాలతో... రాకపోకల్లో అవస్థలు