ETV Bharat / state

మద్యం కోసం ఆరాటం..భౌతిక దూరం పాటించకపోతే తప్పదు గుణపాఠం - విశాఖ నేటి వార్తలు

విశాఖలోని కంటైన్మెంట్ జోన్లు అయిన లక్ష్మీనగర్, ఇందిరా నగర్​లలో మద్యం కోసం మందుబాబులు ఎగబడుతున్నారు. కనీసం భౌతిక దూరం పాటించకుండా బారులు తీరుతున్నారు. ఫలితంగా కరోనా వ్యాప్తి చెందుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా అప్రమత్తమైన అధికారులు, నగరంలోని అన్ని దుకాణాల్లో శానిటైజేషన్ చేశారు.

heavy que infront of wine shops in vizag
మద్యం కోసం గుంపులుగా గుమిగూడిన మందుబాబులు
author img

By

Published : Jul 27, 2020, 12:55 AM IST

విశాఖ గోపాలపట్నంలోని కంటైన్మెంట్ జోన్ ప్రాంతాలైన లక్ష్మీ నగర్, ఇందిరా నగర్​లలో మద్యం దుకాణాల ముందు మందుబాబులు బారులు తీరుతున్నారు. కనీసం భౌతిక దూరం పాటించకుండా గుంపులుగా ఎగబడుతున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి నాలుగు గంటల వరకు... తక్కువ ధర ఉన్న మద్యాన్ని అమ్ముతున్నందున రద్దీ నెలకొంటోంది. ఈ ప్రాంతాల్లో గత నాలుగు రోజుల్లో సుమారు 70 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా ఇక్కడ మద్యం అమ్మకాలు నిలిపివేయాలని స్థానికులు కోరుతున్నారు.

విమర్శలకు స్పందన..

మద్యం దుకాణాల వద్ద సరైన నిర్వహణ లేకపోవడం వల్ల కరోనా వ్యాప్తికి అవకాశం ఉందన్న విమర్శలపై ఎక్సైజ్ అధికారులు స్పందించారు. విశాఖ నగర పరిధిలోని అన్ని దుకాణాలను శానిటైజ్ చేశారు. ప్రతి దుకాణం వద్ద భౌతిక దూరం పాటించేలా గొడుగులు, మాస్కులు తప్పనిసరిగా ధరించేలా ఆదేశాలు జారీ చేశారు.

ఇదీచదవండి.

'హిట్ లిస్టులో ఉన్న రాజకీయ నేతలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.