విశాఖ జిల్లా దేవరాపల్లిలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. అయినప్పటికీ ప్రజల్లో మార్పు రాలేదు. కూరగాయల మార్కెట్, బ్యాంకులు, కిరాణా, ఇతర దుకాణాల వద్ద రద్దీ కొనసాగుతోంది. ఏ ఒక్కరూ భౌతిక దూరం పాటించడం లేదు. మార్కెట్లో కొనుగోలు కేంద్రాల వద్ద ఒకరిపై ఒకరు పడుతూ మరీ కొనుగోలు చేస్తున్నారు. అధికారులు స్పందించి ప్రజలకు కొవిడ్‌పై అవగాహన కల్పించి, చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
ఇదీ చదవండి: