అర్హులైన గిరిజనులకు రిజర్వ్ ఫారెస్ట్‌లో పట్టాలు ఇవ్వకుండా మైనింగ్ మాఫియాకు ప్రాధాన్యతనిస్తూ.. రెవెన్యూ అధికారులు గిరిజనులను చిన్నచూపు చూస్తున్నారని.. గిరిజన గ్రామాల ప్రజలు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఈ ప్రాంతంలో సామల అమ్మకొండకు ఆనుకుని ఉన్న గ్రానైట్ నిక్షేపాలు కొంతమంది మైనింగ్ మాఫియాకు లీజు ప్రాతిపదికన కట్టబెడుతున్నారు. ఫారెస్ట్ భూముల్లో జీడీ, మామిడి తోటలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారికి 80 ఎకరాల భూములకు సంబంధించి పట్టాలు ఇవ్వకుండా.. జాప్యం చేస్తున్నారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై గతంలో చాలా పర్యాయాలు అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. ఇప్పటికీ ఎలాంటి ప్రయోజనాలు లేకపోవటంతో నిరసన కార్యక్రమానికి క్షేత్రస్థాయిలో శ్రీకారం చుట్టామని గిరిజనులు వాపోయారు.
ఇదీ చదవండి:
రిజర్వ్ ఫారెస్ట్‌లో పట్టాలు ఇవ్వాలని.. అర్ధ నగ్న ప్రదర్శన
అర్హులైన గిరిజనులకు రిజర్వ్ ఫారెస్ట్‌లో పట్టాలు ఇవ్వకుండా మైనింగ్ మాఫియాకు ప్రాధాన్యతనిస్తూ.. రెవెన్యూ అధికారులు గిరిజనులను చిన్నచూపు చూస్తున్నారని.. గిరిజన గ్రామాల ప్రజలు అర్ధనగ్న ప్రదర్శన చేశారు.