ETV Bharat / state

బాక్సర్లకు కరోనా కష్టాలు.. వెతలను తెలుపుతూ ప్రదర్శనలు

author img

By

Published : Jul 14, 2020, 12:51 AM IST

ఎంతో మందికి ఆరోగ్యాన్ని అందిస్తూ.. శరీర ధారుడ్యాన్ని పెంచిన జిమ్​ కేంద్రాల నిర్వాహకులైన బాక్సర్లకు కరోనా కష్టాలు చుట్టుముట్టాయి. విశాఖలో జిమ్​లపై ఆధారపడి ఎంతో మంది జీవనం సాగిస్తున్నారు. ఇక్కడ నుంచే సినిమాలకు సైతం బాక్సర్లు వెళ్లేవారు. అలాంటిది జిమ్​ నిర్వాహకులు అద్దెలు చెల్లించలేక, తుప్పు పట్టిన సామాగ్రిని అమ్ముకోలేక నానా అవస్థలు పడుతున్నారు.

gym-owners-protest-to-help-in-lock-down
వెతలను తెలుపుతూ బాక్సర్ల ప్రదర్శనలు

రాష్ట్రంలో జిమ్​లను ఉపాధి కేంద్రాలుగా తీర్చిదిద్దుకున్న బాక్సర్లకు ఇప్పుడు కరోనా కష్టాలు చుట్టుముట్టాయి. లాక్​డౌన్​ కాలంలో నాలుగు నెలలుగా తుప్పుపట్టిన దశకు పరికరాలు చేరుకోవడం.. ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితిలో కన్నీటిపర్యంతం అవుతున్నారు. విశాఖ పారిశ్రామిక ప్రాంతం గాజువాకలో పెద్ద సంఖ్యలో జిమ్​లను ఉపాధి మార్గాలుగా ఎంచుకొని, లక్షల రూపాయలు బ్యాంకు రుణాలు తీసుకుని అధునాత జిమ్ పరికరాలు అద్దె ప్రాంగణాల్లో ఏర్పాటు చేసుకున్నారు.

లాక్​డౌన్ దగ్గర నుంచి వీరికి ఉపాధి కరువైపోవడం వల్ల అద్దెలు కట్టలేక, సామగ్రిని అమ్ముకోవాల్సిన పరిస్దితి దాపురించిందని అవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ వెతలను తెలియజెప్పేందుకు పలు కూడళ్లలో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం కనికరించి పరిమితులతో జిమ్​లను తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని కొరుతున్నారు. ఇతరులకు అందించిన రీతిలో తమకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక సాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇవీ చూడండి...

ప్రారంభమైన ఆపరేషన్ థియేటర్.. తీరిన గర్భిణుల కష్టం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.