విశాఖ జిల్లా తెలుగుదేశం కార్యాలయం అక్రమ నిర్మాణమని మహా విశాఖ నగర పాలక సంస్థ జోన్-3 నుంచి టౌన్ ప్లానింగ్ అధికారి స్వీయ సంతకంతో తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడికి నోటీసులు పంపించారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టంలోని సెక్షన్ 452(2) నిబంధనల కింద నోటీసు అందించినట్టు నోటీసులో పొందుపరిచారు.
ఏడు రోజుల్లో వివరణకు గడువు ఇచ్చినట్లు.. లేనిపక్షంలో జీవీఎంసీ చర్యలు తీసుకుంటుందని నోటీసులో పేర్కొన్నారు. విశాఖ తెదేపా కార్యాలయానికి నోటీసులు పంపడంపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి మోపిదేవి వెంకటరమణ స్పందించారు. రాష్ట్రవ్యాప్తంగా అక్రమ నిర్మాణాలపై ఒకే వైఖరితో ప్రభుత్వం ఉన్నట్లు తెలిపారు. ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు వైకాపా ప్రభుత్వం పోవడం లేదని సమాధానమిచ్చారు.