ETV Bharat / state

పకడ్బందీగా సాగని జ్వరాల సర్వే.. అంతంత మాత్రంగానే దోమల నివారణ.. - ap latest news

రెండేళ్ల క్రితం డెంగీ జ్వరాల్లో విశాఖ నగరం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది.  క్షేత్రస్థాయిలోని పరిస్థితులు చూస్తుంటే మళ్లీ ఈ స్థాయిలో విజృంభిస్తున్నాయనే ఆందోళన వ్యక్తం అవుతోంది. నియంత్రణ ప్రణాళికలు బాగున్నా.. క్షేత్రస్థాయిలో యంత్రాంగం ఆ స్థాయిలో స్పందించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. నగరవ్యాప్తంగా అన్ని వీధుల్లోనూ తగు చర్యలు చేపట్టి దోమలను అరికట్టాలనే జీవీఎంసీ లక్ష్యం పూర్తిస్థాయిలో నెరవేరడంలేదు. ఈ క్రమంలో పలు లోపాలు కనిపిస్తున్నాయి.

gvmc-officials-failure-in-fever-survey
పకడ్బందీగా సాగని జ్వరాల సర్వే.. అంతంమాత్రంగానే దోమల నివారణ..
author img

By

Published : Sep 14, 2021, 11:00 AM IST

డెంగీ జ్వరాలకు కారణమవుతున్న దోమల నివారణకు జీవీఎంసీ పక్కాగా ప్రణాళికలు చేసింది. వార్డు సచివాలయాల పరిధిలోని కార్యదర్శులు నిత్యం 30 ఇళ్లకు వెళ్లి నివారణా చర్యలు చేపట్టేలా సూచనలిచ్చారు. గృహాల్లో దోమలు వృద్ధి చెందేందుకు అవకాశమున్న ప్రతి చోటా పరిశీలించి రసాయనాలు పిచికారీ చేయించాలి. ఇలా ప్రతి ఇంటికీ కనీసం ఒకసారి వెళ్లి అంతా సవ్యంగా ఉందన్న తర్వాతే.. ఆ ఇంటి గోడలకు అతికించిన సర్వే పత్రంలో కార్యదర్శులు, వాలంటీరు సంతకం చేయడంతోపాటు ఆ ఇంటి యజమానితోనూ సంతకం చేయించాలి. కానీ, కొన్ని ప్రాంతాల్లోనే అనుకున్న విధంగా చేస్తున్నారు. ఫలితంగా డెంగీ జ్వర బాధితుల సంఖ్య పెరుగుతోంది. పలు వార్డు సచివాలయాల పరిధిలో జ్వరాలపై దృష్టిపెట్టాల్సిన పారిశుద్ధ్య, సంక్షేమ, ప్రణాళిక కార్యదర్శుల మధ్య సమన్వయం ఉండటంలేదనే ఆరోపణలూ వస్తున్నాయి.

అక్కయ్యపాలెం 80 అడుగుల రోడ్డులో ఒక బహుళ అంతస్తుల భవనం ముందు సంతకాలు లేని స్టిక్కరు

ఫిర్యాదు చేస్తే వచ్చారు...

దువ్వాడలోని వుడానగర్‌ పీహెచ్‌-1 కాలనీలో దోమలు విపరీతంగా ఉన్నాయి. జీవీఎంసీ సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా లేకపోవడంతో ఆ కాలనీ గౌరవాధ్యక్షులు ఫిర్యాదు చేశారు. దాంతో ఓసారి వచ్చి ఫాగింగ్‌ చేశారు. ఆ తర్వాత దోమల నివారణా చర్యలు జరగడంలేదని ఆయన ‘ఈనాడు’కు వెల్లడించారు.

కొరత వేధిస్తోంది...

ఇళ్లు, ఖాళీస్థలాలు.. ఇలా దోమల వృద్ధి కేంద్రాలు ఎక్కడున్నా నివారణ మందులు పిచికారీ చేయించాలి. నైపుణ్యమున్నవారితో యాంటీ లార్వా అపరేషన్లు నిర్వహించాలి. ఇవి అంతటా జరగడం లేదు. మరో వైపు వార్డుల్లో అవసరంకంటే 65 శాతం ఫాగింగ్‌ యంత్రాలు కొరతగా ఉన్నాయి. దోమల నివారణా సిబ్బంది కొరతా వేధిస్తోంది. ఇదే సమయంలో తేలికపాటినుంచి మోస్తరు వర్షాలు తరచూ పడుతుండటంతో పలు ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు నీటి నిల్వలు పెరిగి దోమలు వృద్ధి చెందుతున్నాయి. క్షేత్రస్థాయి నివారణా చర్యలు సరిగాలేక డెంగీ కేసులు...అలాగే మలేరియా కేసులు పెరుగుతున్నాయి. మంగళ, శుక్రవారం మాత్రం డ్రైడే పేరుతో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.

ఈ ప్రాంతాల్లో ఇలా...

  • గాజువాక పరిసర ప్రాంతాల్లో జ్వరాలపై సర్వే సమగ్రంగా జరగడంలేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఇళ్లకు వెళ్లి వాకబు చేసే విధానం పకడ్బందీగా అమలు కావడం లేదు.
  • వేపగుంటలో కొందరు జీవీఎంసీ సిబ్బంది, ఆరోగ్యశాఖ సిబ్బంది ఇంటింటికీ వెళ్లడం లేదు. ప్రణాళికలో భాగంగా ఇళ్లను అనుసంధానం చేసినా వాటిని కేవలం పింఛన్ల పంపిణీ వరకే వాడుతున్నారు.
  • భీమిలి ప్రాంతంలో కొందరు వాలంటీర్లు ఇళ్లలో ఆరా తీయకుండానే గృహాల ముందున్న సర్వే స్టిక్కర్లపై సంతకాలు చేసేసి వెళ్లిపోతున్నారు. ఈ ప్రాంతంలో జ్వరాలు బాగా పెరుగుతున్నాయి.
  • కొమ్మాది, ఆర్‌ఎస్‌కాలనీ, వాంబేకాలనీ, స్వతంత్రనగర్‌, మధురవాడ, పీఎంపాలెం, వైఎస్సార్‌నగర్‌, మారికవలస తదితర ప్రాంతాల్లో.. డెంగీ కేసులు పెరుగుతున్నాయి.
  • ఎంవీపీకాలనీ, ఫిషర్‌మెన్‌కాలనీ, వెంకోజీపాలెం, పెదజాలరిపేట, కేఆర్‌ఎంకాలనీలలో విష జ్వరాలు బాగా ఉన్నాయి. ఇక్కడ మురికివాడలపై దృష్టిపెట్టిన జీవీఎంసీ.. ఇతర ప్రాంతాల్లో దోమల నివారణచర్యలు తీసుకోవడంలేదనే ఆరోపణలున్నాయి. బీ కంచరపాలెం దేవేందర్‌నగర్‌, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో దోమలవృద్ధి పెరిగింది.

దృష్టిసారించని యంత్రాంగం..

పట్టణ ఆరోగ్యకేంద్రాల పరిధిలోని ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు తమ పరిధిలోని ప్రాంతాల్లో జ్వరాల నిర్మూలనకు కృషి చేయాలి. వీరు కొవిడ్‌ టీకా ప్రక్రియలో నిమగ్నమయ్యారు. కొన్ని వార్డు సచివాలయాల్లోని సిబ్బంది సైతం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా లేరు. జీవీఎంసీ కమిషనర్‌ జి.సృజన ఈ అంశాలపై గట్టిగా ప్రశ్నించినట్లు సమాచారం. జోనల్‌ అధికారులు విస్తృతంగా పర్యటించాలని తాజాగా ఆదేశించారు.

ఇదీ చూడండి: Permanent transfer: ఏపీకి శాశ్వత బదిలీ... తెలంగాణ సర్కారు అనుమతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.