విశాఖ ఆంధ్రయూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మార్గంలో ఉన్న దుకాణాలను జీవీఎంసీ అధికారులు కూల్చేశారు. నీటి పారుదల శాఖకు చెందిన ఆ స్థలంలో సుమారు అరవై ఏళ్లుగా చిరు వ్యాపారులు ఉంటున్నారు. అయితే స్థల ఆక్రమణ కింద జీవీఎంసీ అధికారులు శనివారం దుకాణాలు కూల్చేశారు.
కనీసం నోటీసులు ఇవ్వకుండా దుకాణాలు కూల్చడం వల్ల తమ కుటుంబాలు రోడ్డు పాలయ్యారని దుకాణాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా రాని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వచ్చిందో చెప్పాలని అధికారులను నిలదీశారు. రాజకీయ ఒత్తిళ్లతోనే అధికారులు ఈ పని చేశారని వారు ఆరోపిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న విశాఖ తూర్పు ఎమ్మెల్యే రామకృష్ణబాబు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా దుకాణాలు కూల్చివేయటం దారుణమని మండిపడ్డారు. అధికారులను చర్యలను ఖండించారు.
ఇదీ చదవండి