విశాఖలోని ఓ ఇంట్లో గుట్టుగా మాంసం విక్రయిస్తున్న వారిని జీవీఎంసీ అధికారులు పట్టుకున్నారు. కొవిడ్ కట్టడిలో భాగంగా ఇవాళ విశాఖలో ఎటువంటి మాంసం విక్రయాలు చేయకూడదని జీవీఎంసీ కమిషనర్ జి. సృజన ఆదేశాలు జారీ చేశారు. మాంసం, చేపలు.. అమ్మే దుకాణాల వద్ద ఎవరూ భౌతిక దూరం పాటించటం లేదని.. అటువంటి ప్రదేశాల్లో కరోనా వ్యాప్తికి అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ ఆదేశాలతో విశాఖలో ఎక్కడా మాంసం దుకాణాలు తెరవలేదు.
నగరంలోని కప్పరాడ ప్రాంతంలో ఓ ఇంట్లో మాసం విక్రయిస్తున్నారన్న సమాచారంతో జీవీఎంసీ అధికారులు అక్కడకు చేరుకుని మాంసాన్ని సీజ్ చేశారు.
ఇదీ చదవండీ.. సెప్టెంబరు నాటికి పిల్లలకూ టీకా!