విశాఖ నేవి స్థలంలో హనుమాన్ ఆలయ నిర్మాణాన్ని జీవీఎంసీ అధికారులు అడ్డుకున్నారు. ఆలయ స్థంభాలను కూల్చివేశారు. అక్కడే ఉన్న బుద్ధుడి విగ్రహం కూల్చివేయడతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకుని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి, విశ్వహిందూ పరిషత్ సభ్యులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఇతర సంస్థలకు చెందిన స్థలంలో జీవీఎంసీ అధికారులు ఎందుకు పెత్తనం చలాయిస్తున్నారని ప్రశ్నించారు. వైకాపా ప్రభుత్వం హిందూ ధర్మం పట్ల సానుకూల వైఖరి చూపక పోతే ప్రజలే తగిన శాస్తి చేస్తారని శ్రీనివాసానంద సరస్వతి అన్నారు.
ఇదీ చదవండి: అంతర్వేది ఘటనను సీబీఐకి అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు